ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఇప్పుడు కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నది. ప్రధానంగా కార్యకర్తల విషయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నుంచి కూడా కింది స్థాయి నేతలు వరకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. పార్టీ కోసం పదేళ్లపాటు కష్టపడిన కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు కూడా దొరకడం లేదు. ప్రధానంగా టీడీపీని టార్గెట్ గా చేసుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఎన్నో విమర్శలు చేయడం... ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు. టీడీపీ చేస్తున్న అన్యాయాన్ని యువతకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా సరే అది విపక్షాలు ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ బలంగా ఉన్న నేపథ్యంలో తన కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి కొన్ని కొన్ని విషయాల్లో ముందడుగు వేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న తప్పులు మాత్రం పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

క్షేత్రస్థాయిలో పార్టీ మారిన నేతలు కొంతమంది ఇప్పుడు వైసీపీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంతో వైసీపీ నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కేసులు ఎదుర్కొన్న నేతలు ఉన్నారు. అలాగే కార్యకర్తలు కూడా జగన్ కోసం ఎంతో పోరాటం చేశారు. సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగతంగా తిట్టించుకున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగక పోవటంతో ఇప్పుడు కార్యకర్తలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: