ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల పట్ల చిన్న చూపు వహిస్తున్నడా..! అంటే అవుననే అంటున్నాయి పలు రైతు సంఘాలు. పౌరసరఫరాల కార్పొరేషన్ రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లించడంలో సీఎం జగన్ జాప్యం చేస్తున్నాడు అంటూ రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు ను విమర్శిస్తూ "48 గంటల్లో రైతులకు ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లించలేరా?" అని చెప్పిన జగన్ ఇప్పుడు తాను చేస్తుంది ఏంటని రైతులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును చెల్లించడంలో గత ప్రభుత్వం అటు ఇటు వారం రోజులలోగా చెల్లించగా.. అయితే జగన్ ప్రభుత్వం  దాదాపుగా 15 నుండి 30 రోజుల సమయం తీసుకోవడంతో రైతులు జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు.. కొన్ని సందర్భాలలో నెల రోజులు దాటినా రైతుల అకౌంట్లో నగదు జమ కావడం లేదు. చెల్లింపుల కాలాన్ని ఒకేసారి ఎక్కువగా పెంచడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అకాల వర్షాల వల్ల భారీగా పంట నష్టపోయి దిగుబడి తగ్గిపోగా, దానికి కూడా నగదు చెల్లించే విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని భావించారు. వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో ఆ అంచనా ఒకేసారి 40లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది.ఇందులో ఇప్పటివరకూ 25.7లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు నుంచి పౌరసరఫరాల కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది. దాని మొత్తం విలువ రూ.4,811 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకూ రూ.2,842 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా రూ.1,969 కోట్లు చెల్లించాల్సి ఉంది. అది కూడా నాలుగురోజుల కిందట రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. మొన్నటివరకూ నిధుల్లేవని రైతులకు నగదు చెల్లించకుండా నిలిపివేసిన ప్రభుత్వం సంక్రాంతి సమయంలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. ఇంకా మిగిలిపోయిన రూ.2వేల కోట్లు ఎలా చెల్లిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: