ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతుండటం అటు ఏటీఎం మోసాల ద్వారా ఎంతోమంది భారీగా నష్టపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక ఇటీవలే మరోసారి కస్టమర్ల సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజురోజుకు ఏటీఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ లకు ఊరట కలిగించే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది.



 ఇక ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్ అమలులోకి తీసుకు వచ్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయించింది.  ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకున్న కొత్త నిర్ణయంతో ఈ బ్యాంకులో అకౌంట్ కలిగినవారు నాన్ ఈఎంవి ఎటిఎం మిషన్ డబ్బులు తీసుకోవడానికి అస్సలు వీలు కాదు.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాలో  అధికారికంగా వెల్లడించింది. నాన్ ఈఎంవి ఎటిఎం మిషన్ల ద్వారా ఫైనాన్షియల్ నాన్  ఫైనాన్స్
ట్రాన్సాక్షన్ నిలిపివేస్తున్నట్లు  ఇటీవలే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


 ప్రస్తుతం రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతుండటం మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఊరట కలిగే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెప్పుకొచ్చింది. దీనివల్ల కస్టమర్లు ఎలాంటి మోసాలకు గురి కాకుండా వారి డబ్బు సురక్షితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ నాన్ ఈఎంవి ఎటిఎం అంటే ఏంటి అంటారా.. ఒకవేళ మీరు.. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మీ కార్డును ఏటీఎం మెషీన్‌లో పెట్టి.. మీ కార్డు ఏటీఎంలో లేకుండా వెంటనే వెనక్కి తీసుకోగలిగితే ఆ ఏటీఎంలను నాన్ ఈఎంవీ ఏటీఎంలు అని పిలుస్తారు. అంటే ఏటీఎం మెషీన్ మ్యాగ్నటిక్ స్ట్రిప్ ద్వారా మీ డేటాను తీసుకుంటుంది. ఇలా కాకుండా మీ కార్డు ఏటీఎం మెషీన్‌లోనే కొంత సేపు ఉంటే అది ఈఎంవీ ఏటీఎం. ఇందులో ఏటీఎం మెషీన్ కార్డుపై ఉన్న చిప్ నుంచి డేటాను తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: