ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితం లో ఎంతో మందికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది వివిధ ఆరోగ్య సమస్య లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యం గా ఈ మధ్య కాలంలో ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఒక్క సారి డయాబెటిస్ వచ్చింది అంటే చాలు జీవన విధానం మొత్తం మారి పోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఆహారం నుంచి నిద్ర వరకూ ప్రతీ విషయం లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరంలోని అవయవాలు షుగర్ ప్రభావం కారణం గా పని చేయడం మానేస్తూ  ఉంటాయి.  ఆహారం తీసుకునే విషయంలో డయాబెటిస్ బాధితులు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంతే కాదు నోరు కట్టేసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒకవేళ డయాబెటిస్ తో  బాధపడుతున్న వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గినా పెరిగినా ప్రమాదమే అన్న విషయం తెలిసిందే. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి ఎంతో కష్టపడుతుంటారు డయాబెటిస్ బాధితులు.



 అయితే టైప్2 డయాబెటిస్ తో  బాధపడే బాధితుల శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.  రోజు మొత్తంలో మధ్య మధ్యలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందేలా చూసుకోవాలి.  ఒక్కసారి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతుంది.  అందుకే రోజు మొత్తంలో సమాన పరిమాణంలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందిస్తూ ఉండాలి.  ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవాలి. అయితే రోజంతా కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకోవడం డయాబెటీస్ రోగులకు ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.  అయితే కొద్ది కొద్దిగా ఆహారం తీసుకొన్న సమయంలో చిరుతిళ్ళకు మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: