పౌర సరఫరాల శాఖ నూతన వాహనముల ప్రారంభోత్సవం సందర్భముగా విజయవాడలో ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు అధికారులు. 21 న ఉదయం 10.25 గంటలకు పొర సరఫరాల శాఖ నూతన వాహనముల ప్రారంభోత్సవం ఉంటుంది. బెంజి సర్కిల్ వద్ద జరిగే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్  హాజరు అవుతారు. బెంజ్ సర్కిల్ మీదుగా ప్రయాణించే వాహన రాకపోకల  ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు చేస్తారు. అన్ని భారీ వాహనాలు ,లారీలు 21  ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్ళిస్తున్నారు.

20 రాత్రి 9 గంటల నుండి 21  మధ్యాహ్నం 12 గంటల వరకు యం.జి. రోడ్ వాహనాలు అనుమతించబడవు అని అధికారులు స్పష్టం చేసారు. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం ,ఇబ్రహీంపట్నం వైపుకు వెళ్ళు భారీ వాహనాలు ఒంగోలు - త్రోవగుంట- బాపట్ల - అవనిగడ్డ - చల్లపల్లి- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్ళిస్తారు. ఏలూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు లారీలు, భారీవాహనాలు హనుమాన్ జంక్షన్  నుండి నూజివీడు- మైలవరం - జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళిస్తారు.

ఏలూరు నుండి చెన్నై వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి .గుడివాడ - పామర్రు చల్లపల్లి - అవనిగడ్డ - బాపట్ల - త్రోవగుంట ఒంగోలు మీదుగా మళ్ళిస్తారు. గుంటూరు వైపు నుండి విశాఖపట్నం ,హైదరాబాద్ వైపు వెళ్ళు కార్లు, ఇతర చిన్నవాహనాలను 21 ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు కనక దుర్గ వారది పై అనుమతించబడవని అధికారులు పేర్కొన్నారు. మంగళగిరి లేదా తాడేపల్లి నుండి ప్రకాశం బారేజ్ మీదుగా విజయవాడ లోనికి అనుమతించవని అధికారులు స్పష్టం చేసారు. తాడిగడప నుండి వచ్చు కార్లు, ఇతర చిన్న వాహనములను యన్.టి.ఆర్ సర్కిల్ వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసారు. గుంటూరు వైపునకు వెళ్లే వాహనాలకు కృష్ణవేణి స్కూలు రోడ్డు, రామలింగేశ్వర నగర్ ,స్కూ బ్రిడ్జ్ జంక్షన్ మీదుగా అనుమతి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: