చిత్తూరు: యువతులపై దాడులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిత్తూరులో మంగళవారం మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి లోనవక తప్పదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని తూర్పు పల్లెకు చెందిన గాయత్రి, పూతలపట్టు మండలం చింతమాకుల పల్లెకు చెందిన డిల్లీ బాబు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు వేరు కావడంతో.. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరేమో అని ఇద్దరూ కలిసి డిసెంబర్ 13న తిరుపతికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఇద్దరి వయసు 20 సంవత్సరాలే కావడంతో.. డిల్లీ బాబుకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిద్దరిని వారి వారి ఇళ్లకు పంపేశారు.

గాయత్రిని తన తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వక పోవడంతో డిల్లీ బాబు రగిలిపోయాడు. ఇదే సమయంలో గాయత్రి తనకు దూరమైపోతుందేమోనని డిల్లీ బాబు అనుమానించాడు. గాయత్రి తల్లిదండ్రులు ఆమె మనసు మార్చేసి ఉంటారని, ఇంక తనకు గాయత్రి దక్కదని అనుకున్నాడు. అంతే.. తనకు దక్కని యువతి మరెవ్వరికి దక్కకూడదని క్రూరంగా ఆలోచించాడు. మంగళవారం గాయత్రి పక్కింటి అమ్మాయిలతో కలిసి పెనుమూరుకు వెళ్లి.. మధ్యాహ్నం సమయంలో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారిని డిల్లీ బాబు ఆపాడు. పక్కకు రమ్మని పిలవగా గాయత్రి తాను రానంటూ నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన డిల్లీ బాబు వెంట తెచ్చిన చాకుతో గాయత్రి గొంతును కోశాడు.

ఈ సమయంలో గాయత్రితో పాటు వచ్చిన యువతులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం గాయత్రిపై కోపంతో ఆమెను 19 సార్లు పొడిచి పొడిచి అతి కిరాతకంగా ఆమెను చంపి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గాయత్రిని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గాయత్రి కన్ను మూసింది. గాయత్రి కుటుంబ సభ్యులు డిల్లీ బాబు ఇంటికి నిప్పంటించి, అతడి తండ్రిని చితకబాదారు. ప్రస్తుతం డిల్లీ బాబు ఆచూకీని కనిపెట్టే పనిలో పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: