కృష్ణా జిల్లా టీడీపీలో ప‌రిస్థితి ఏంటి? ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఎంతో ఐక్య‌త ఉంద‌ని.. నాయ‌కులు క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగుతున్నార‌ని భావించిన చంద్ర‌బాబుకు తాజాగా జ‌రిగిన మాజీ మంత్రి దేవినేని ఉ మా ప‌రిస్థితి కొత్త లెస్స‌నే నేర్పింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్రం గా ఉంది. కీల‌క నేత‌లు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. వీరినిసంఘ‌టిత ప‌రిచి. పార్టీ ని ముం దుకు తీసుకువెళ్లే బాధ్య‌త‌ను మాజీ మంత్రి దేవినేనికే అప్ప‌గించారు చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో.. ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల్లోనూ.. కొత్తగా పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసే బాద్య‌త‌లు అప్ప‌గించారు.

అంటే.. దీనిని బ‌ట్టి.. జిల్లాలోనూ పార్టీని స‌మ‌న్వ‌య ప‌రుచుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే.. దీనిని వ‌దిలేసి.. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను కాపాడుకునేందుకు, త‌న స‌త్తా చాటుకునేం దుకు ఉమా ప్ర‌య‌త్నించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న‌ప్పుడు.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డం మానేశార‌నే వాద‌నుంది. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్లు ఇప్ప‌టికీ అంటీముట్ట‌న‌ట్టు గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ప‌రిణామం.. తాజా ఘ‌ట‌న‌ల‌తో మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మైంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా రాజ‌కీయాల‌పై అంతో ఇంతో ఉన్న ఆశ‌లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన‌ట్టు అయింద‌ని అంటున్నారు. జిల్లాలో కీల‌క‌మైన మాజీ మంత్రి స్థాయి వ్య‌క్తిపై అధికార పార్టీ నేత‌లు మాట‌ల యుద్ధం చేసిన‌ప్పుడు.. టీడీ పీ త‌ర‌ఫున స‌రైన ప్రతిఘ‌ట‌న ఎదురు కాలేద‌ని.. పైచేయి సాధించ‌లేక పోయార‌నేది స్ప‌ష్టంగా వినిపిస్తు న్న‌వాద‌న‌.

విజ‌య‌వాడ‌కు చెందిన నాయ‌కులు.. ఇది మాకు సంబంధించిన విష‌యం కాద‌ని అనుకుంటే. జిల్లాకు చెందిన వారిలో కేవ‌లం ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే స్పందించ‌డం.. పార్టీలో ఉన్న అనైక్య‌త‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. దీంతో దేవినేని తాజా ఉదంతం పార్టీకి కానీ, అటు వ్య‌క్తిగ‌తంగా ఉమాకు కానీ.. ఎలాంటి ల‌బ్దీ చేకూర్చ‌క‌పోగా.. మైల‌వ‌రంలో ఇమేజ్‌ను మ‌రింత డ్యామేజీ చేయ‌డం గ‌మనార్హం. మొత్తంగా ఈ ప‌రిణామం.. టీడీపీకి మైన‌స్‌గా మారింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: