ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని మాటల దాడి చేస్తుండగా.. టీడీపీ నేత నారా లోకేశ్.. జగన్‌పై గురిపెట్టారు.జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్సూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని వైఎస్ జ‌గ‌న్ ఘోరంగా మోసం చేశారు' అని విమర్శించారు.అసలే అకాల వర్షాలకు పంట నష్టపోయి, దిగుబడి లేక కనీసం పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఓ కౌలు రైతుకు మార్కెటింగ్ అధికారుల తీరు మరింత మనస్థాపానికి గురిచేసింది.పండించిన పంటను బయ్యర్లతో కుమ్మక్కయి అధికారులు గిట్టుబాటుధర ఇవ్వకపోవడంతో సదరు కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో మరంత మనోవేధనకు గురయిన రైతు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషాద సంఘటన ఏపీలో  చోటుచేసుకుంది.  ...

ప్రశ్నిస్తే చంపేసే నియంత జగన్ మోహన్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకేష్ . ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ను ప్రశ్నించిన వెంగయ్య అనే వ్యక్తిని చంపేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.ఇవి ప్రభుత్వ హత్యలే. చెత్త పాలనని ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కేసు క్లోజ్ చెయ్యడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం. వైకాపా రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’’ అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు.


చందర్లపాడు పట్టణంలో కట్టా లక్ష్మీనారాయణ అనే రైతు కౌలు పొలంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్న ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్  వేదికన స్పందించారు..25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ప్రతాప్ ని చంపేశారని ఆరోపించారు. ఇవన్నీ ఏపీ సీఎం జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు

మరింత సమాచారం తెలుసుకోండి: