రెండు నెల‌ల త‌ర్వాత జాక్ మా జాడ క‌నిపించింది.  బుధ‌వారం ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న టీచ‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  గ్రామీణ స్థాయిలో విద్యావృత్తి చేప‌డుతున్న టీచ‌ర్ల‌ను ఆయ‌న కొనియాడారు.  గ‌త కొన్ని నెల‌ల నుంచి ఆయ‌న ఆచూకీ లేని విష‌యం తెలిసిందే.  జాక్ మా అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంక్ రెగ్యులేటరీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో జాక్‌ మాపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన వ్యాపారాలపై విచారణకు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల త‌ర్వాత నుంచి జాక్ మా బ‌యటి ప్ర‌పంచానికి క‌నిపించలేదు.  ఆయ‌న‌కు చెందిన యాంట్ గ్రూపుపై చైనా ప్ర‌భుత్వం ఆగ్ర‌హంగా ఉంది. ఆ కంపెనీ ఐపీవోల‌ను చైనా ప్ర‌భుత్వం అడ్డుకున్న‌ది. ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తం చేసింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


అలీబాబా సంస్థపై కూడా చైనా ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్ట‌డం కూడా ఆయ‌న‌పై ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని చెప్ప‌క‌నే చెబుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. చైనాలో ప్ర‌భుత్వ ఆంక్ష‌లు ఎక్కువ ఉన్నాయ‌ని జాక్ మా ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో స్థానిక ప్ర‌భుత్వం ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే జాక్ మా  అదృశ్యం వెనకు చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. జాక్‌మా వందమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులతో వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను రిలీజ్ చేసింది.


 ‘‘కరోనా మహమ్మారి ముగిన తర్వాత మళ్లీ మనం కలుద్దాం’ అని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా అన్న వీడియోను గ్లోబల్ టైమ్స్ చూపించింది. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్‌మా దూరంగా ఉంటారని వారు పేర్కొంటున్నారు. జాక్‌‌‌‌ మాకు చెందిన కంపెనీలు అలీబాబా, యాంట్ గ్రూప్‌‌‌‌లను చైనీస్ ప్రభుత్వం నేషనలైజ్ చేయాలని చూస్తోంది. కంపెనీ మోనోపలి కార్యకలాపాలపై ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో భాగంగానే చైనీస్ కమ్యూనిస్ట్‌‌‌‌ పార్టీ యాంట్ గ్రూప్‌‌‌‌ను, అలీబాబాను నేషనలైజ్ చేయాలనుకుంటోంది. కమ్యూనిస్ట్ పార్టీలో టాప్‌‌‌‌ వ్యక్తుల నుంచే అలీబాబాను నేషనలైజ్ చేసే విషయం బయటికి వచ్చిందని ఐబీ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: