ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల పేరిట ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు భారీగా డబ్బులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్షేమ కార్యక్రమాలు ముసుగులో రాష్ట్ర పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా ఇప్పటివరకు నిర్మాణం జరిగిన పరిస్థితి లేదని చెప్పాలి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరిగిన సరే... మరో కార్యక్రమం జరిగిన సరే... అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా వేగంగా జరిగేవి అనే మాట వాస్తవం.

చాలా నియోజకవర్గాల్లో రోడ్లను చంద్రబాబునాయుడు హయాంలో నిర్మాణం చేపట్టారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి కూడా వ్యక్తం అయింది. కానీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏ ఒక్క జిల్లాలో కూడా రోడ్ల పరిస్థితి అనుకున్న విధంగా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనిపై ప్రజలలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. వైసీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఎంత సేపు సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేసి ఇవ్వడమే గాని రోడ్లు కూడా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. రాజకీయంగా బలపడటానికి ప్రజలకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రోడ్లు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రోడ్ల మీద దృష్టి సారించకపోవడంతో ప్రజల్లో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద జగన్ కు మద్దతు రావడం లేదని అంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డబ్బులు ఇస్తున్నారు అనే భావన కూడా చాలామందిలో బలపడుతోంది. ఇప్పటికైనా ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని వైసీపీ కార్యకర్తలు అనే పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: