తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయవర్గాలలో జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో కూడా బలపడాలని భావిస్తున్నది కాబట్టి సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అంటే... ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించింది కాబట్టి.

కానీ ఈ జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రాకపోవడం కనీసం సీఎం కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు పదేపదే పర్యటనలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి రాకపోవడంతో ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి.

భవిష్యత్తులో కూడా ఇదే వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాల్లో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే త్వరలోనే సీఎం కేసీఆర్ వరంగల్ కరీంనగర్ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పుడు మీడియా వర్గాలకు ఈ సమాచారం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటనేది తెలియకపోయినా ఉగాది తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రాజకీయం కాస్త హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి సీఎం కేసీఆర్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: