హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మొత్తం సీఎం కేసీఆర్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సీఎం కేసీఆర్ తన ముఖ్యమంత్రి పోస్ట్‌ను తన కొడుకు, మంత్రి అయిన కేటీఆర్‌కు ఇవ్వనున్నారని వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. తగిన సమయం చూసి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనేది తెలుస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రస్తావన గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ విషయంపై స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేముందని ఆయన అన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఆయన మాటల బట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండొచ్చని గుసగుసలు వినపడుతున్నాయి. కేటీఆర్ రాష్ట్రంలో ఏ పనైనా చేయగల సమర్థుడు అని తలసాని కొనియాడారు. మరోపక్క కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారన్న వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని ప్రగతి భవన్‌లో చాలా టీవీలు పగులుతున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. టీవీలు పగులుతున్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో ఉన్న నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం కావడం ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతి సారి కేసీఆర్ ఈటలను ముందు పెట్టి తాను బయట పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు ఉందని, కేటీఆర్ సీఎం అయితే తమకొచ్చే లాభమేమీ లేదని ఆయన తెలిపారు. కేసీఆర్ తర్వాత అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం ఎంత వరకు వచ్చిందో తెలియాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: