అడిషనల్ డిజిపి ఏ. రవిశంకర్ ను కలిసిన ఏపీ... బిజెపి  నాయకులు కీలక వ్యాఖ్యలు చేసారు. కపిలతీర్థం నుండి రామతీర్థం యాత్రకు అనుమతి కోసం అభ్యర్ధన పత్రాన్ని విష్ణువర్ధన్ రెడ్డి మరియు బిజెపి  బృందం అందించింది. ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... బిజెపి యాత్ర రూట్ మ్యాప్ ను వివరించేందుకు డిజిపి కార్యాలయానికి వచ్చాం అని అన్నారు. రవి శంకర్ అయ్యర్ ను కలిసి యాత్ర కు సంబంధించిన వివరాలు తెలిపాం అని ఆయన వెల్లడించారు. ఏపీ  లో జరుగుతున్న సంఘటనల పై జనసేన తో కలిసి యాత్ర చేపట్టాం అని ఆయన పేర్కొన్నారు.

ఫిబ్రవరి నాలుగో తేదీన తిరుపతి లో బహిరంగ సభ  అనంతరం యాత్ర ప్రారంభిస్తాం అని అన్నారు. కపిల తీర్థం నుంచి బయలుదేరి నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం, మీదుగా రామతీర్థం కు యాత్ర చేరుకుంటుంది అని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాలలో ధ్వంసం చేసిన ఆలయాలను పరిశీలిస్తాం అని ఆయన తెలిపారు. ఈ యాత్ర లు, సభలలో పలువురు బిజెపి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు అని ఆయన స్పష్టం చేసారు. శాంతియుతంగా చేపట్టే ఈ యాత్ర కు పోలీసులు అనుమతి ఇస్తారనే భావిస్తున్నాం అని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడితో  ఇవ్వకుంటే...‌ మా కార్యాచరణ ప్రకటిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

హిందువుగా మా ఆలయాలను దర్శించుకునే స్వేచ్చ మాకుంది అని అన్నారు. మాకు అన్ని మతాల పై గౌరవం ఉంది... ఎదుటి మతాలను అగౌర పరచకూడదు అని స్పష్టం చేసారు. కానీ హిందూ ఆలయాల పైనే దాడులు జరుగుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. డిజిపి కార్యాలయానికి   కూతవేటు దూరంలో వేలాది మందితో కూటములు జరుగుతున్నాయి అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా వారికే తెలియాలి అని అన్నారు. వచ్చె నెల నాలుగో తేదీన తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించి తీరుతాం అని  స్పష్టం చేసారు. హిందూ ఆలయాల పై దాడులలో బిజెపి కార్యకర్తలు పాత్ర ఉందని డిజిపి చేసిన వ్యాఖ్యలు ఖండించాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: