ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నిర్మాణం విషయంలో తీవ్ర ఆరోపణలు రావడంతో సిఎం జగన్ దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా విశాఖలో ఆర్ అండ్ బి మంత్రి శంకర్ నారాయణ , ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు జిల్లాల రోడ్ల అభివృద్ధి పైన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి  శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం రోడ్లుపై అశ్రద్ధ చూపించింది అని ఆయన ఆరోపించారు. రోడ్లు పేరుతో టీడీపీ ప్రభుత్వం 3000 కోట్లు తెచ్చి నిధులు పక్కదారి పట్టించింది అని మండిపడ్డారు.

రోడ్లు అభివృద్ధి కి 2200 కోట్లు ఖర్చు అవుతుంది అని అన్నారు. రోడ్లు మరమత్తుల కోసం సీఎం  1000 కోట్లు  విడుదల చేశారు అని ఆయన వెల్లడించారు. సుమారు 1500 కోట్ల రూపాయలు గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టింది.  ఇప్పుడు 450 కోట్లు చెల్లిస్తున్నాం అని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం అని అన్నారు. గత ఏడాది రోడ్ల మరమత్తుల కోసం 1500 కోట్లు ఖర్చు చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ.. కృష్ణ బాబు కూడా మీడియాతో మాట్లాడారు.

విశాఖ బీచ్ రోడ్డు నుండి భోగాపురం, ఎయిర్ పోర్ట్ కు 6 లైన్ల రోడ్ల విస్తరణ కోసం 1500 కోట్లతో డీపీఆర్ రూపొందిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. షీలా నగర్ రోడ్డు తో పాటుగా, విజయనగరం రాజమహేంద్రవరం, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే లు కూడా వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిపి  సుమారు 32 వేల కోట్ల రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలతో పాటు పనులు కూడా  నడుస్తున్నాయి అని అన్నారు. కాగా రోడ్ల నిర్మాణం జరగడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: