అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ నేటితో పదవి కాలం ముగిసిపోయింది. మరికొద్ది గంటల్లో ఆయన అధ్యక్ష భవనాన్ని  వీడనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్  చివరగా  చేసిన  ప్రసంగాన్ని వైట్ హౌస్ అధికారులు విడుదల చేసారు .. ఈ ప్రసంగంలో తన హయాంలో అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ గుర్తుచేసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు  ఈవారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నా. వారికి మా శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో అదృష్టమూ వారికి తోడుండాలని ప్రార్థిస్తున్నా’ అని బైడెన్‌ బృందానికి ఆహ్వానం పలికారు.

ఇక తన ప్రసంగం లో క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ  ట్రంప్‌ మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్ని సహించేదిలేదని పునరుద్ఘాటించారు.ఈ దాడి వల్ల అమెరికా పౌరులు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు .. ఇక చైనా సహా పలు దేశాలతో నెరిపిన దౌత్య విధానం తన హయాంలో సాధించిన విజయాలుగా ట్రంప్‌ చెప్పుకున్నారు. అలాగే పలు దేశాలతో కుదిరిన ఒప్పందాలను కూడా గుర్తుచేసుకున్నారు. ‘అమెరికా నాయత్వాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా బలపర్చాం. దీని కారణంగా యావత్తు ప్రపంచం మళ్లీ మనల్ని గౌరవించడం ప్రారంభించిందని తెలిపారు . అలాగే మధ్య ఆసియాలో అనేక శాంతి ఒప్పందాలకు కృషి చేశాం.  గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎలాంటి యుద్ధాలు ప్రారంభించని తొలి అధ్యక్షుడిగా గర్వపడుతున్నాను’ అని ట్రంప్‌ తెలిపారు.



‘మేము ఏం చేయాలని ఇక్కడకు వచ్చామే అంతకంటే ఎక్కువే చేశాం.. కఠినమైన యుద్ధాలు, కష్టతరమైన పోరాటాలు, చాలా కష్టమైన ఎంపికలను చేశాను.. ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకున్నారు’ అని అన్నారు. ‘నేను ఈ అద్భుతమైన ప్రదేశం నుంచి  సంతోషకరమైన హృదయంతో.. మన దేశానికి, మన పిల్లలకు మరిన్ని ఉత్తమమైన రోజులు రాబోతున్నాయన్న విశ్వాసంతో వెళ్తున్నాను’ అంటూ అధ్యక్షుడిగా ట్రంప్‌ తన చివరి ప్రసంగాన్ని ముగించారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: