రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం కంటే ఏమాత్రం తీసిపోవట్లేదని ఓ హామీ  విషయంలో రుజువు అయ్యింది.. చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నా అందులో లోటుపాట్లు కోకొల్లలు.. మళ్ళీ ప్రజలకు మాత్రం తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలుచేశాం.. తొంభై ఐదు శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.. మాట తప్పడు మడిమ తిప్పడు అనే నినాదంతో వైసీపీ జగన్ ను విపరీతంగా ప్రచారం చేస్తుంది.. ఇప్పటివరకు ఇచ్చిన మాట అయితే తప్పలేదు కానీ జగన్ ఇచ్చిన మాటను తిప్పుతున్నాడు..

అంటే ఇచ్చిన మాటను నెరవేర్చి, నెరవేర్చకుండా అక్కడక్కడే తిప్పుతూ గాలిలో మేడలు కట్టడం అన్నమాట.. పాదయాత్ర సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒక్కటి నిరుద్యోగ సమస్యను  రాష్ట్రంలో లేకుండా చేయడం.. ప్రతి ఏడాది జనవరి లో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించి నిరుద్యోగ సమస్య ను  తీర్చేస్తామని వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పూర్తిగా మర్చిపోయారని చెప్పాలి. ఎందుకంటే అయన అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ఉద్యోగాలు అన్న మాటను పూర్తిగా పక్కన పెట్టేశాడు. ప్రతి జనవరి లో అన్న హామీ పక్కన పెడితే ఏడాది పొడుగునా ఎదురు చూసిన ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జగన్ విడుదల చేయలేదు..

గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము కదా,  డాక్టర్ లను కాంట్రాక్ట్ బేస్డ్ అప్పాయింట్ చేశాం కదా అంటే జగన్ ఇచ్చిన హామీ ఇది కాదు రెగ్యులర్ ప్రభుత్వాల ఉద్యోగాలు.. ఇవి ఇంతవరకు ప్రకటించలేదన్నది ఏపీ నిరుద్యోగుల ప్రశ్న..ప్రతి సంవత్సరం జనవరి లో ఎదురుచూస్తున్నట్లుగానే ఈ సారి నిరుద్యోగులు జగన్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అని ఎదురుచూడగా ఈసారి కూడా జగన్ మొండిచేయి చూపుతున్నట్లుగానే పరిస్థితి ఉంది.  మొదటి సంవత్సరం కొత్త గా వచ్చిన ప్రభుత్వం కదా అని అన్నారు.. రెండో సంవత్సరం కరోనా పేరు చెప్పుకుని దాటించారు.. మూడో సంవత్సరం కూడా కరోనా పేరు చెప్పి దాటేసే ప్రయత్నం చేస్తున్నారు.. మూడు సంవత్సరాలు ఇలానే గడిచిపోతే మిగిలిన రెండు సంవత్సరాలలో ఉద్యోగాలు ఇస్తామని గ్యారెంటీ ఏంటి.. అసలే జమిలీ ఎన్నికలు అంటున్న సమయంలో జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రచారం లో మునిగిపోతే నిరుద్యోగుల ఆశలు ఏమైపోవాలి.. వందకు వందశాతం సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న జగనోరి హామీకి కొంచెమైనా విలువలేదా..

మరింత సమాచారం తెలుసుకోండి: