వచ్చే ఏడాది మార్చి నాటికి తెలుగుదేశం పార్టీని నలభయ్యళ్ళు నిండుతాయి. ఇంత సుదీర్ఘ కాలం ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం అంటే అది రికార్డు గానే  చెప్పుకోవాలి. తమిళనాడులో డీఎంకే. అన్నాడీఎంకే  ప్రాంతీయ పార్టీలు యాభై అరవై ఏళ్ల బట్టి కూడా కొనసాగుతున్నాయి. ఏపీలో మాత్రం తొలి రికార్డు టీడీపీదే. ఆ తరువాతే ఎవరైనా.

ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీకి పాతికేళ్ళుగా అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఎన్టీయార్ పార్టీ పెట్టినా కేవలం పద్నాలుగేళ్లు మాత్రమే కొనసాగారు. ఇక అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన రికార్డు కూడా చంద్రబాబుకే ఏపీలో ఉంది. అదే సమయంలో ఇప్పటికి మూడు సార్లు సీఎం సీటు ఎక్కిన చంద్రబాబు ఈ వయసులో కూడా ఎందుకు పోరాడుతున్నారు అంటే దానికి జవాబు కూడా రెడీగా ఉంది.

ఆయన తన వారసుడు లోకేష్ ని సీఎం గా చూడాలని ఆరాటపడుతున్నారు. అందుకోసమే ఈ తపనా తాపత్రయం అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే కచ్చితంగా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని ప్రచారం అయితే టీడీపీలో సాగుతోంది. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు వయసు డెబ్బై దాటింది. పైగా ఆయన చేసేసిన పదవి కావడంతో తన రాజకీయ వారసుడిగా కుమారుడిని కూర్చోబెట్టాలన్న పట్టుదలతోనే ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికలలో మాత్రం చంద్రబాబు సీఎం అభ్యర్ధి అని ప్రచారం లో ఉన్నా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉండరని అంటున్నారు. ఒకవేళ సీఎం సీట్లో కూర్చున్నా కూడా ఏడాది తరువాత అయినా కుమారుడికే పట్టం కడతారు అంటున్నారు. దీని బట్టి తేలేది ఏంటి అంటే చంద్రబాబు బొమ్మతోనే వచ్చే ఎన్నికలను టీడీపీ ఫేస్ చేయనుంది. ఆ తరువాతనే లోకేష్ తెర మీదకు వస్తారు అంటున్నారు. ఇక సీఎం అభ్యర్ధిగా అందరి అమోదం పొందడానికే లోకేష్ జిల్లాల టూర్లు చేస్తున్నాడు అని కూడా అంటున్నారు. చూడాలి మరి టీడీపీ రాజకీయం ఎలా సాగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: