ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో భారత్ ఎంతో వ్యూహాత్మకం గా వ్యవ హరిస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం ఏమో కానీ చైనా సృష్టించిన ఉద్రిక్త పరిస్థితులు  భారత్కు ఎంత గానో కలిసి వస్తున్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో ప్రపంచ దేశాలు మొత్తం భారత్ తో  దోస్తీ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యం గా చైనాను బద్ధ శత్రువుగా చూస్తున్న జపాన్ భారత్ తో  కలిసి నడిచేందుకు ఇప్పటికే ఎన్నో రకాల కీలక నిర్ణయాలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే.



 చైనాలో ఉన్న జపాన్ కంపెనీలు అన్నింటినీ పెట్టు బడులు విరమించుకుని బయటకు రావాలని పిలుపునిచ్చిన జపాన్.. ఇక బయటకు వచ్చిన కంపెనీల మొత్తం భారత్ లోకి వెళ్తే  భారీ ప్రోత్సాహకం కూడా అందిస్తామనటం  ఆసక్తికరం గా మారి పోయింది. జపాన్ చేసిన ప్రకటన తో  భారత్-జపాన్ మధ్య ఎలాంటి  బంధం వుంది అన్నది అర్థం అయింది అన్న విషయం తెలిసిందే.  ఇక జపాన్  భారత్ వంటి దేశాలు చైనా కు సంబంధించిన 5 జి నెట్వర్క్ కీ  ఎక్కడి కక్కడ చెక్ పెడుతూ ఊహించని విధంగా చైనా కు షాక్ ఇచ్చాయి.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం అగ్రరాజ్యాలతో ఎంతో వాణిజ్యపరమైన వ్యాపారపరమైన సంబంధాలను మెరుగుపరచుకునేందుకు  భారత్  ఇప్పుడు జపాన్ తో  కలిసి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే మూడు అంశాల్లో  భారత్-జపాన్ మధ్య ఒప్పందాలు కుదిరాయి.  సముద్రపు అడుగు నుంచి కేబుల్ వేసేలా భారత ప్రతిపాదనకు జపాన్  అంగీకరించండి.  అంతేకాకుండా 5 జీ  సేవల విషయంలో జపాన్ సహాయ సహకారాలు అందించేందుకు  ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా జపాన్ కీలక  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: