ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎర్రకోట పై కూడా పడింది.. దీని కారణంగా ఆ ప్రాంతంలో కాకులు మృతి చెందడంతో ఎర్రకోటను మూసేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఈ విధంగా జరడం  కలకలం రేపుతోంది.  ఈ నేపథ్యం లో జనవరి 26 వరకు ఎర్ర కోటలోకి సందర్శకులకు అనుమతి లేదంటూ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

ఎర్రకోట ప్రాంగణంలో జనవరి 10న  కాకులు చనిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అయితే  మృతి చెందిన కొన్ని కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్‌లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది...

బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఢిల్లీ శివారు ప్రాంతాల నుంచి  చికెన్‌ను నగరంలోకి తరలించకుండా నిషేధం విధించింది. అలాగే  ఢిల్లీలోని  గాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను పది  రోజుల పాటు మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు... కొన్ని రోజుల క్రితం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో  ఓ గుడ్లగూబ చనిపోగా అందుకు కారణం బర్డ్‌ఫ్లూ అని తేలింది. ఇక రిపబ్లిక్ డే వేడుకల విషయానికి వస్తే  ఎప్పటిలాగే యథావిధిగా జరగనున్నాయి ..

అయితే దేశంలో ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని గుర్తించినట్టు కేంద్రం  తెలిపింది.  ఈ జాబితాలో చత్తీస్‌గఢ్‌, దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌, పంజాబ్‌ ఉన్నాయి. ఇందులోనూ హరియాణా, మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో మాత్రమే కోళ్లఫారాల్లోను  బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. కేరళ, మహారాష్ట్రల్లో కొత్తగా మరిన్ని కోళ్లఫారాల్లో  కేసులు బయటపడుతున్నాయని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ తెలిపింది. ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా అన్నిరకాలుగా ప్రచారం చేస్తున్నట్టు వెల్లడించింది.




 


 


మరింత సమాచారం తెలుసుకోండి: