అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల రాజధాని వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన హింసాత్మక దాడులకు ట్రంప్ మద్ధతివ్వడమే కాకుండా తన ట్వీట్స్ ద్వారా హింసను ప్రేరేపించాడనే కారణంగా ఆయన ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేయాలని ట్విట్టర్ ఖాతా గతంలోనే నిర్ణయం తీసుకున్నది. అదేదారిలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్, ట్విచ్, స్పాటిఫై, షాపిఫై వంటి సంస్థలు ట్రంప్ అకౌంట్లు నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం తదితర సమయాల్లోనూ ఆన్లైన్ ద్వారా ట్రంప్ మరోసారి నిరసనలను ప్రోత్సహించే అవకాశం ఉండటంతో ఫేస్బుక్ తొలుత జనవరి 20 వరకు ట్రంప్ అకౌంట్పై నిషేధం విధించింది. అనూహ్యంగా ఫేస్బుక్ కూడా ట్విట్టర్ తరహాలోనే శాశ్వతంగా ఆయన అకౌంట్పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్ బుక్ సీఈవో జుకెన్ బర్గ్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ట్రంప్ అకౌంట్ పై తొలుత తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, ఆయన అకౌంట్ ని ఇప్పట్లో తిరిగి స్థాపించే ఆలోచన తమకు లేదని ఇన్ స్టా గ్రామ్ సీఈవో ఆడమ్ మోసేరి స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై నిషేధం విధించడంపై ఆడమ్ మోసేరి మాట్లాడుతూ తాము ఒక నిర్దిష్ట ఖాతాపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. మా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకొని హింసను ప్రేరేపించే వారిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. తన పదవీ కాలంలో మిగిలి ఉన్న సమయాన్ని తన స్వలాభానికి వాడుకుంటూ హింసను ప్రేరేపించడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ట్రంప్ అకౌంట్ను బ్యాన్ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
                          గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ సంస్థ కూడా ట్రంప్ అకౌంట్ల పై  శాశ్వత నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ద్వారా ట్రంప్ హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున, ఆయన కొత్త వీడియోలను పోస్ట్ చేయకుండా చేసేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్లు గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ స్పష్టం చేసింది. ‘ట్రంప్ అకౌంట్లపై నిషేధాన్ని ఎప్పుడు ఎత్తివేసే విషయంపై ఇప్పట్లో స్పష్టతనివ్వలేం. ప్రస్తుతానికైతే, ఆయన అకౌంట్ను తిరిగి ప్రారంభించే ఆలోచన కూడా మాకు లేదు. కొద్ది రోజుల తర్వాతే ఈ విషయంపై స్పష్టతనిస్తామని యూట్యూబ్ సీఈవో మొస్సేరి పేర్కొన్నారు. ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తొలుత డొనాల్డ్ ట్రంప్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తూ కొన్ని వీడియోలు ట్రంప్ తన ఖాతాలో అప్ లోడ్ చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్లకు 2.77 మిలియన్ల సబ్ స్కైబర్సు ఉన్నారు. కాగా, అధికారిక దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమెరికాలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ట్రంప్ ఖాతాపై సోషల్ మీడియా సంస్థలు వరుసగా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: