రాజకీయాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఎవరూ ఇక్కడ ఏమీ కారు. బంధాలు అనుబంధాలకు తావు లేవు. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే బీజేపీతో కలసి పోయేందుకు ఒక ప్రాంతీయ పార్టీ ఎదురుచూస్తూంటే బీజేపీ మాకు ఫ్రెండ్ అని మరో పక్షం భావిస్తోంది. అయితే ఏపీలో తమకు ప్రజలతోనే బంధం తప్ప ఎవరూ మిత్రులు కారని బీజేపీ పక్కా క్లారిటీ ఇచ్చేసింది. ఇక తమకు ఉన్న ఒకే ఒక మిత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రమే  అంటూ కుండబద్ధలు కొట్టింది.

ఏపీలో రధయాత్ర చేస్తామంటే  అధికార వైసీపీకి ఎందుకంత కంగారు అంటూ ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ నిలదీస్తున్నారు. బీజేపీ రధయాత్ర చేస్తాను అంటే ఇంతర రాజకీయ పక్షాలు ఎందుకు వణుకుతున్నాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో విపక్షంలో ఉన్నపుడు జగన్ పాదయాత్ర చేయలేదా అని ఆయన లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

ఏపీలో తమకు జనసేనతో తప్ప ఎవరితోనూ పొత్తులు లేవని కూడా పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు. తమకు ఏపీ రాజకీయాల్లో జగన్, చంద్రబాబు ఇద్దరూ శత్రువులేనని తేల్చేశారు. బాబు జగన్ పోవాలి...  సోము. పవన్ రావాలి ఇదే తమ కొత్త నినాదం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీలో వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను తాము రధయాత్ర ద్వారా ఎండగడతామని ఆయన స్పష్టం చేస్తున్నారు.అలాగే ఏపీలో వరసగా జరుగుతున్న  విగ్రహాల ద్వంసంపైన‌ ప్రభుత్వం పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, దాని మీద కూడా ప్రజలలో  నిలదీసి తీరుతామని అన్నారు. ఇక ఏపీలో చంద్రబాబుతో తమకు భవిష్యత్తులో పొత్తు కుదిరే చాన్స్ లేదని సునీల్ స్పష్టం చేశారు. గతంలో పొత్తులు ఉండబట్టి అలా ఎవరికైనా సందేహాలు ఉండవచ్చు కానీ తమ వైపు నుంచి లైన్ క్లియర్ గా ఉందని ఆయన పేర్కొంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని కూడా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ జగన్ ని శత్రువుగానే చూస్తోంది. అది అర్ధమైంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: