స్వార్ధానికి నిలువెత్తు మూర్తీభవించిన రూపం కలవకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఉరఫ్ కచరా కుటుంబం తెలంగాణ అంతటా వినిపించే ఆణిముత్యమంత మాట. దీనికి కారణం ఎన్నికల ప్రచార సమయంలో కచరా ప్రవచించిన మేనిఫెస్టో అంశాలే నిరంతరం ప్రశ్నార్ధాలు కావటమే.

ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న తెలంగాణ జనావళికి అవే ఇప్పుడు కరువయ్యా యని ప్రజలు పలునోళ్ళతో ఘోషిస్తున్నారు. కాళెశ్వరం ప్రోజెక్టు లక్ష కోట్ల రూపాయిలు వ్యయం చేసినా గతం కంటే అదనంగా ఒక్క ఎకరం కూడా వ్యవసాయభూమి సాగులోకి రాలేదంటున్నారు తెలంగాణవారు. ఈ పధకం పూర్తిగా కమీషన్ల పధకం అంటూ తీవ్రంగా ప్రతిపక్షాలు చెపుతున్నాయి.

డబుల్ బెడ్రూం ఇళ్ళు పధకంలో అనేక అవకతవకలు జరిగాయని, గృహాల నాణ్యత బహు చవకగా ఉందని ఒక న్యూస్ చానల్ ఆ గృహాలను చూపిస్తూ న్యూస్ టెలికాస్ట్ చేసినా కూడా ప్రభుత్వంలో ఇసుమంత చలనం లేదని అంటున్నారు.  

డబుల్ బెడ్రూం ఇళ్ళు ప్రచారములో గాని,  ఇండ్లపై గాని ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నించింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి నిర్మిస్తున్న “డబుల్ బెడ్ రూం” ఇళ్లపై ముఖ్యమంత్రి ఫొటో పెట్టి, ప్రధాని మోదీ ఫొటో పెట్టక పోవటంలోని ఆంతర్యాన్ని వివరించాలని స్పష్టం చేసింది. ప్రధాని ఫొటోో పెట్టాలని కఠినంగానే ఆదేశించింది.

పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నలు వర్షంలా కురిసినా, తెలంగాణా అధికారుల సమాధానాల చినుకులు లాగానే పడాయి.

మచ్చుకు కొన్ని ప్రశ్నలు 

*డబుల్ బెడ్రూం ఇళ్ళపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఎందుకు పెట్టడం లేదు?
*గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులు ఎందుకు నత్త నడకన సాగుతున్నాయి?
*ఈ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దారి మళ్లించింది?
*ఈ ప్రోజెక్టులకు నిధులను ఎందుకు ఆలస్యంగా విడుదల చేసింది?
*రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఏప్పుడెప్పుడు విడుదల చేస్తుంది?

అని ప్రశ్నల వర్షం కురిపించింది.

లోక్ సభ సభ్యుడు జగదాంబిక పాల్ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ స్థాయి సంఘం మంగళవారం నగరంలోని ఒక హోటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి పథకాలు – వాటి అమలు తీరుపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది.

వరంగల్, కరీంనగర్ ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మొత్తం రూ.1500 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉండగా ఎందుకు విడుదల కాలేదు? అని స్థాయి సంఘం సభ్యులు తెలంగాణ అధికారులను నిలదీశారు.

“స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ”  వేశారా? మూడు నెలలకోసారి జరగవలసిన ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయా?

*పి పి పి (ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం) కింద చేపట్టాల్సిన పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు?          

*పి  పి పి అంశంపై కేంద్ర ప్రభుత్వ లేఖలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేసిన నిధులకు సమానంగా .392 కోట్ల రూపాయిలు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ బదులిచ్చినట్టు సమాచారం. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 80 వేలకు పైగా గృహాలను ఎందుకు లబ్ధిదారులకు కేటాయించడం లేదు? సభ్యులు ప్రశ్నించగా వీటికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: