వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మ‌ణుల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డిందా?  అధికార పార్టీ నాయ‌కులే బ్రాహ్మ‌ణుల‌పై దాడులు చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి బ్రాహ్మ‌ణుల‌పై అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ నాయ‌కులు పెత్త‌నం చేస్తున్నారు. కీల‌క‌మైన ఆల‌యాల్లో బ్రాహ్మ‌ణుల‌పై ఒత్తిడి తెస్తున్నారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ టెంపుల్ స‌హా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని అర్చకుల‌పైనా నేత‌ల పెత్త‌నం ఎక్కువైంద‌నేది ఇటీవ‌ల ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. అయితే.. కొన్ని వెలుగు చూస్తుండ‌గా.. మ‌రికొన్ని మాత్రం లోపాయికారీగా రాజీ చేసుకుని అక్క‌డితో ముగిస్తున్నారు.

క‌ర్నూలు జిల్లాలోని ఓ ఆల‌యంలో పూజాల‌ను ఈవోతో క‌లిసి వైసీపీ నేత‌లు చిత‌క్కొట్టిన వ్య‌వ‌హారం తెలిసిందే. ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో విగ్ర‌హాలు తెచ్చిపెట్టిన వివాదం వెలుగు చూడ‌డంతో ముగ్గురు అర్చకుల‌ను వివ‌రాలు చెప్పాలంటూ.. ఎమ్మెల్యే అనుచ‌రులు ఇంటికి వెళ్లిమ‌రీ వేధించారు. ఇక‌, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న‌లోనూ పూజారుల‌పై రుస‌రుస‌లాడారు. ఇక్క‌డే ప‌డుకోండి! అని ఓ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. రామ‌తీర్థంలో రాముని శిర‌చ్ఛేదం ఘ‌ట‌న వెలుగు చూసిన త‌ర్వాత‌.. కూడా పూజారుల‌పై ఇంట‌రాగేష‌న్ ఇటు పోలీసుల నుంచి అటు రాజ‌కీయ నేత‌ల‌నుంచి తీవ్ర‌స్థాయిలో చోటు చేసుకుంది.

దాడులు జ‌రిగిన ఆల‌యాల్లోని పూజారులు స‌హా ఇత‌ర ఆల‌యాల్లోని పూజారులు కూడా బిక్కుబిక్కు మంటూ కాలం గ‌డుపుతున్నారు. కొంద‌రు రాత్రి వేళల్లో అయితే.. ఆల‌యాల్లో తీవ్ర‌మైన చలిలో నిద్ర‌చేస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో.. ఏ నేత త‌మ‌పైకి దాడికి వ‌స్తాడో అని భ‌య‌ప‌డుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. నిజానికి రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌ను పూజారుల‌పైకి నెట్టేయాల‌ని కూడా కొంద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నించారు.

అయితే.. మ‌రింత వివాదం అవుతామ‌ని భావించి వెన‌క్కి త‌గ్గారు. ఇలా జ‌గ‌న్ పాల‌న‌లో పూజారుల‌కు, బ్రాహ్మ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి సాయం అంద‌క‌పోయినా.. వారిపై మాత్రం అనుమానాలు వేధింపులు నిత్యం కృత్యంగా మారాయి. మ‌రి జ‌గ‌న్ కు ఇవ‌న్నీ తెలుసా?  తెలిసే ఇలా జ‌రుగుతోందా?  అనేది ప్ర‌శ్న‌. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: