ఏమాటకామాటే చెప్పుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఒక కార్పొరేష‌న్ ఏర్ప ‌డింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో బ్రాహ్మ‌ణుల కోరిక మేర‌కు ఆయ‌న ఈ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తిసారీ బ‌డ్జె ట్‌లో సుమారు 25 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించేవారు. ఈ నిదుల నుంచి పేద బ్రాహ్మ‌ణుల‌కు రుణాలు, ఉప‌న‌య‌నాల‌కు ఉచి త సంబారాలు, పెళ్లిళ్ల‌కు కానుక‌లు, బ్రాహ్మ‌ణ వితంతువుల‌కు రూ. 2500 పింఛ‌న్లు, వృద్ధులకు రూ.2000 పింఛ‌ను, బాల బాలిక లకు సాధార‌ణ విద్య అందించేవారు. అదేస‌మ‌యంలో వేద‌విద్య‌ను అభ్య‌సిస్తామ‌నే వారికి వారిపేరిట రూ.50000 వేసి.. వారు ఆ చ‌దువును(ప‌దిహేనేళ్లు) పూర్తి చేసుకున్నాక వ‌డ్డీతో స‌హా చెల్లించేవారు.

ఈ కార్పొరేష‌న్ ద్వారా క‌శ్య‌ప‌, ద్రోణాచార్య వంటి స‌త్కారాల‌ను కూడా ఏర్పాటు చేసి గురువుల‌ను ప్రోత్స‌హించేవారు. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో నాలుగు సంవ‌త్సరాలు అమ‌లైన ఈ కార్య‌క్ర‌మం.. నిజానికి రాష్ట్ర బ్రాహ్మ‌ణుల‌కు స్వ‌ర్ణ‌యుగ‌మ‌నే చెప్పాలి. పైగా ఎలాంటి రాజ‌కీయ ప్ర‌లోభాలు లేకుండా అప్ప‌టి రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్నారావును చైర్మ‌న్‌గా నియ‌మించారు. దీంతో బ్రాహ్మ‌ణుల‌కు మేలు జ‌రిగేది. క‌ట్ చేస్తే.. ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. ఈ ప‌థ‌కం ఎలా ఉందో.. కూడా ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి ప‌థ‌కం అయితే ఉంది. ఇది కూడా బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌గానే చ‌లామ‌ణి అవుతోంది. కానీ, నిధులు కేటాయిస్తున్నా.. ఖ‌ర్చుకు మాత్రం ఇవ్వ‌డం లేదు.

బ‌డ్జెట్‌లో అంకెలు క‌నిపిస్తున్నాయి. కానీ, ఎవ‌రికీ కేటాయింపులు లేవు. పైగా రాజ‌కీయ నేత‌ల‌కు చైర్మ‌న్‌గిరీ ఇవ్వ‌డంతో అన్నీ రాజ‌కీయ సిఫార్సుల‌తోనే న‌డుస్తున్నాయి. పైగా చంద్ర‌బాబు హ‌యాంలో ప్రారంభ‌మైన కార్పొరేష‌న్‌ కావ‌డంతో ప్ర‌భుత్వం అడుగ‌డుగునా నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో కార్పొరేష‌న్ ఊసును ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు. ఇక‌, పింఛ‌న్ల‌ను కూడా ఎత్తేసి.. సాధార‌ణ పింఛ‌న్ల‌లో క‌లిపేశారు. అదేవిధంగా వేద విద్య‌కు ఇచ్చే రూ.5 నుంచి 10 ల‌క్ష‌ల‌ను ఎత్తేశారు.

అదే స‌మ‌యంలో పెళ్లిళ్ల‌కు ఇచ్చే కానుక‌ల‌ను కూడా ర‌ద్దు చేశారు. దీంతో బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ పేరుకు ఉన్నా.. ఫ‌లితం సున్నా.. అన్న‌ట్టుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏదైనా ఉంటే.. ఎమ్మెల్యే, బ్రాహ్మ‌‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ద‌గ్గ‌ర‌కు కాళ్ల‌రిగేలా తిరిగితే.. స‌వాలక్ష ప్ర‌శ్న‌లు గుప్పించి చేద్దాం చూద్దాం.. అంటూ దాట‌వేస్తున్నార‌ని బ్రాహ్మ‌ణ‌లు ఆరోపిస్తున్నారు. ఇదీ.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నాడు-నేడు సంగ‌తి!!

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: