తెలంగాణ లో సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను కచ్చితంగా హరీష్ రావు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో జరుగుతుంది. హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుని టిఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళిన సంగతి తెలిసింది. మంత్రిగా కూడా ఆయన మంచి విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలుసు.

ఇక టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇతర పార్టీల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సమర్థవంతంగా సీఎం కేసీఆర్ కి అండగా నిలిచారు హరీష్ రావు. అయితే ఇప్పుడు కేటిఆర్ సిఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉండటంతో హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వర్గాలలో వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అలాగే కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది.

అయితే ఇది నిజమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. హరీష్ రావు కి  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించటమే కాకుండా మూడు కీలక శాఖలను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా రావచ్చు అని సమాచారం. స్వయంగా కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. కేటీఆర్ ని సీఎం చేయడానికి కంటే ముందే హరీష్ రావుని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే బాగుంటుంది అని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: