ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర  హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు మాత్రం అడ్డుకోలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సింగిల్ జడ్జి ఎన్నికల నిర్వహణ ఆదేశాలను డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది రాష్ట్ర హైకోర్టు. వచ్చే నెల 4 నుంచి నాలుగు విడతల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో విపక్షాలు ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎక్కడైనా 24 శాతం ఏకగ్రీవం అయిన పరిస్థితి  రాష్ట్రం లో ఉన్నదా అని ఆయన నిలదీశారు. అప్పుడు ఎన్నికలు కరోన ఉన్న కావాలని అన్నారు... ఇప్పుడు వద్దంటున్నారు అని ఆయన ఆరోపించారు.

మీరు ఎన్నికల్లో  ఓట్లు  గుద్దు కోవాలనుకుంటున్నారా మిమ్మల్ని ప్రజలు ఉళ్లలోనికి రానివ్వరు జాగ్రత్త  అని హెచ్చరించారు. కౌన్సిల్ రద్దు అన్నారు ఇంకోవైపు నామినేషన్ వేయిస్తారా అసలు మీకు క్రెడిబిలిటీ ఉందా అని నిలదీసారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను జగన్ నేనే  పెడతాను అంటారు అని ఆయన ఎద్దేవా చేసారు. ఒకటి రెండు ఛానల్ లు గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి ఛానెల్స్ కట్ చేస్తారా అని నిలదీశారు. వాటికి ప్రత్యామ్నాయం ఉంటుంది అని, డిజిపి కాకిబట్టలు కు గౌరవం ఇవ్వాలి అని సూచించారు. జడ్జ్ లు మారినంత మాత్రాన  న్యాయం మారదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: