రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్ట్ నేడు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటి వరకు అనేక అనుమానాలు ఉండగా నేడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఎన్నికలను నిర్వహించాలి అని రాష్ట్ర హైకోర్ట్ చెప్పడంపై ఇప్పుడు విపక్షాల నేతలు చాలా హ్యాపీ గా ఉండటమే కాకుండా న్యాయమే గెలిచింది అంటూ స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు పై స్పందించిన బిజెపి నేతలు... కీలక వ్యాఖ్యలు చేసారు. సిఎం రమేష్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల  ఎన్నికల కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం అని అన్నారు.

సింగిల్ జడ్జి తీర్పు సమయంలో  వైసిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు అని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ ను రాజీనామా చేయాలన్నారు అని గుర్తు చేసారు. ఇప్పుడు ధర్మాసనం తీర్పు తో వారంతా రాజీనామా లు చేస్తారా అని ప్రశ్నించారు. అందుకే నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు అని సూచించారు. సుప్రీం కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించ వచ్చని చాలా సార్లు తీర్పు చెప్పింది అని అన్నారు. వ్యాక్సినేషన్ కు, ఎన్నికలకు సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేసారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...

ఎవరెన్ని కుట్ర లు‌  చేసినా..  న్యాయమే గెలుస్తుంది అని అన్నారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నంత కాలం ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుంది అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన వైసిపి ప్రభుత్వమే.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు తో అయినా... ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన సూచించారు. గతంలో అధికార పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడింది అని మండిపడ్డారు. భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ఎన్నికల షెడ్యూల్ మొత్తం రద్దు చేయాలి.. మళ్లీ పెట్టాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: