తెలుగుదేశం పార్టీకి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఇదే వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ వ‌ర్గం గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు టీడీపీని నెత్తిన పెట్టుకుంటూ వ‌స్తోంది. గ‌తంలో ఎన్టీఆర్‌కు వ‌న్ సైడ్‌గా స‌పోర్ట్ చేసిన క‌మ్మ వ‌ర్గం ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు కూడా అంతే మ‌ద్ద‌తు ఇచ్చింది. చంద్ర‌బాబు తొలి సారి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఓడిన‌ప్పుడు కూడా బాబునే న‌మ్మింది.

ఇటు చంద్ర‌బాబు సైతం క‌మ్మ వ‌ర్గంలో మ‌రో నేత ఎద‌గ‌కుండా... ఈ వ‌ర్గానికి తానే ప్ర‌తినిధిగా ఎదిగారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ్యాధికారం ద‌క్కించుకుని.. పెద్ద ప‌ద‌వి అధిరోహించాలంటే చంద్ర‌బాబు మిన‌హా వేరే క‌మ్మ నేత ఎవ్వ‌రూ క‌న‌ప‌డడం లేదు. చంద్ర‌బాబు అయినా త‌న త‌ర్వాత త‌న వార‌సుడు లోకేష్ మాత్ర‌మే టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టి... ముఖ్య‌మంత్రి అవ్వాల‌నే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర తొలి సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ క‌మ్మ వ‌ర్గంలో చాలా మంది చంద్ర‌బాబు తీరుతో ఇబ్బందులు ప‌డ్డారు.

వైసీపీ కూడా చంద్ర‌బాబును బూచీగా చూపించి.. చివ‌ర‌కు క‌మ్మ వ‌ర్గంపై స‌మాజంలో మిగిలిన కులాల‌పై తీవ్ర వ్య‌తిరేక భావాన్ని క్రియేట్ చేయ‌డంతో పాటు ఈ వ‌ర్గాన్ని మిగిలిన వ‌ర్గాల‌కు దూరం చేసే విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది. అస‌లు చంద్ర‌బాబుతో సంబంధం లేని క‌మ్మ నేత‌లు కూడా బాబు తీరుతో చాలా ఇబ్బంది ప‌డ్డారు. ఈ వ‌ర్గంలో వైద్య‌, విద్యా, పారిశ్రామిక‌, ఆర్థిక‌, వాణిజ్య రంగాల్లో ఉన్న వారంతా ఇప్పుడు చంద్ర‌బాబుకు క్ర‌మ‌క్ర‌మంగా దూర‌మ‌వుతోన్న పరిస్థితి.

పోయిన చోటే వెతుక్కోవాల‌న్నట్టుగా చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీ కోసం ఎంతో చేసిన క‌మ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి.. బీసీల‌కు ప‌ద‌వులు ఇస్తున్నారు. దీంతో పార్టీని న‌మ్ముకున్న క‌మ్మ‌లు కూడా ఇప్పుడు బాబుకు దూరం జ‌రుగుతున్నారు. మ‌రి వీరిని బాబు ఎలా మ్యానేజ్ చేస్తారో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: