ప్రస్తుతం మన దేశంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సర కాలంపాటు కరోనా వైరస్ వలన నష్టపోయిన ప్రజలకు శుభవార్త లాగా కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చేసింది. ఇందులో భాగంగానే మొదటగా లాక్ డౌన్ సమయంలో అందించిన సేవలకుగానూ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు ఇస్తూ వస్తున్నారు. దీని తరువాత మిగతా వారందరికీ ఒక క్రమ పద్దతిలో దశల వారీగా టీకాలు వేయనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదంతా ఇలా ఉండగా, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో అతి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ గుర్తించలేదని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

వ్యాక్సిన్ వచ్చిన రోజు నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వ్యాక్సిన్ వలన ఎటువంటి ప్రమాదం లేదని అలాగే ఈ వ్యాక్సిన్ వలన పిల్లలు పుట్టరు అనే అసత్యాన్ని నమ్మొద్దని ప్రజలందరికీ అధికారికంగా తెలియచేసారు. ఈ విధమైన కారణాలతో తెలంగాణలో కొంతమంది సిబ్బంది సరిగ్గా వ్యాక్సినేషన్ వేసుకునే సమయానికి విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురయినట్లు సమాచారం. ఇటువంటి వారికి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే వారికి నిర్ధేశించిన వ్యాక్సిన్ సమయంలో హాజరు కాకుంటే, వారికి వేయవలసిన వ్యాక్సిన్ ను వేరొకరికి వేయనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా తెలంగాణ ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

భవిష్యత్తులో అటువంటి వారు మళ్ళీ వ్యాక్సిన్ పొందే అవకాశాన్ని కోల్పోతారు. కావున అందరూ మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొవాలని ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సూచనలిచ్చింది. ప్రస్తుతం మన దగ్గరున్న వ్యాక్సిన్ పై ఎటువంటి అపనమ్మకం అవసరం లేదని నిర్భయంగా మీరు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని సిబ్బందిని మోటివేట్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఒకరోజుకి మొత్తంమీద 60 నుంచి 70 శాతం మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుండగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశామని వైద్యాధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: