ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక చాలా నిర్ణ‌యాలు ఆవేశంలో తీసుకుంటున్నార‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. మూడు రాజ‌ధానుల వికేంద్ర‌క‌ర‌ణ విష‌యం నుంచి ఏపీ ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తొల‌గింపు వ్య‌వ‌హారం వ‌ర‌కు అన్నింటిలోనూ జ‌గ‌న్ దూకుడుగానే వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే సామాజిక వ‌ర్గాల వారీగా కూడా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ‌కు మైన‌స్ గా మారింది. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో జ‌గ‌న్ పంతానికి పోయిన‌ట్టే క‌నిపించింది.

ఈ అంశంపై కోర్టుల్లో వాద‌, ప్ర‌తి వాద‌న‌లు.. వాయిదాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు హైకోర్టు ఎన్నిక‌లు జ‌ర‌పాల‌నే తీర్పు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో
ప్రజారోగ్యం, పంచాయతీ ఎన్నికలు రెండూ ముఖ్యమేని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంత‌కు ముందు విడుద‌ల అయిన పంచాయ‌తీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధ‌ర్మాస‌నం కొట్టి వేసింది. ఒక‌సారి ఎన్నిక‌ల షెడ్యూ ల్ విడుద‌ల అయ్యాక అందులో కోర్టులు జోక్యం చేసుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌.

ఇక కొద్ది రోజులుగా న‌డుస్తోన్న ఈ వివాదంలో నిమ్మ‌గ‌డ్డ సైతం పంతానికి పోయి ఏపీ స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష న్ విడుద‌ల చేసేశారు. చివ‌ర‌కు అటు ప్ర‌భుత్వం అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని కోర్టుకు వెళ్లి నోటిఫికేష‌న్ స‌స్పెండ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు కోర్టు ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని చెప్ప‌డం.. ఆ వెంట‌నే వ‌చ్చే నెల‌లో నాలుగు తేదీల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించ‌డంతో నిమ్మ‌గ‌డ్డ ఉండ‌గా.. ఎన్నిక‌లు నిర్వ‌హించకూడ‌ద‌ని పంతంతో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏం చేస్తుందా ? అన్న‌దే అస‌క్తిక‌రం.

ఈ వార్‌లో తాజా తీర్పు జ‌గ‌న్ స‌ర్కార్‌కు మింగుడు ప‌డ‌ని అంశంగానే చెప్పాలి. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుకోకుండా నిమ్మ‌గ‌డ్డ‌తో పంతానికి పోయిన మ‌రోసారి కోర్టు తీర్పు ముందు ఓడిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: