మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసంలో, పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్ రెడ్డి తో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాల తో  జిల్లాలో ఉన్న సమస్యల పైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ టూరిజం శాఖ సంయుక్తంగా ఒక మీటింగ్ విశాఖలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

 అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని మంత్రి వివరించారు. ఐటీ రంగాన్ని ఏపీలో మరింత బలోపేతం చేస్తామని అన్నారు మంత్రి. మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమ మైన వ్యవస్థ అని ఆయన కొనియాడారు. దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు  లభించాయి అని ఆయన పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. చంద్రబాబు రామతీర్థం  సైతం రాజకీయాలకు వాడుకున్నారు అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో దాడి చేసిన సంస్కృతి లేదు తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకు వచ్చారు  అని విమర్శలు చేసారు.

విజయ సాయి రెడ్డి మీద హత్యాయత్నం చేశారు.. ఆటవికంగా , పాశవికంగా  దాడి చేశారు అని ఆరోపించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే అయిన ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది అని అన్నారు. ఆయన మీద  దాడి చేసే విధంగా వ్యవహారశైలి ఉందని పోలీసులు అరెస్టు చేశారు అని మండిపడ్డారు.  పోలీసులు  ఆధారాలు లేకుండా  చర్యలు తీసుకోరు అని అన్నారు. చంద్రబాబుకి ప్రతి రోజు ఒక రాజకీయ కార్యక్రమం ఉండాలి అని, రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలు చేస్తుంటే  మంచి పేరు వస్తుందని ఈ నిరసన అని మండిపడ్డారు. చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి అని కోరారు.కాగా చంద్రబాబు హయాంలోనే మెడ్ టెక్ జోన్, ఫైబర్ గ్రిడ్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: