తెలంగాణాలో మంత్రులు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనంగా ఉన్నాయి. సిఎంగా కేటిఆర్ బాధ్యతలు చేపట్టాలి అంటూ కొందరు మంత్రులు పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపట్టాలి అంటూ  తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపట్టే విషయంలో ఇప్పుడు తెలంగాణాలో ఎలాంటి స్పష్టత రావడం లేదు. అయితే సిఎం కేసీఆర్ మాత్రం తాజాగా మంత్రి కేటిఆర్ కోసం పూజలు చేసారు అనే వ్యాఖ్యలు వినిపించాయి.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఒకేలా చూడాలి అని అన్నారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన్ లో లేదు అని అన్నారు. మేమూ ఇండియాలోనే ఉన్నాం అని పేర్కొన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ను కేంద్రం ఆదుకోలేదు అని మండిపడ్డారు. ఏడుపు తప్ప తెలంగాణ కు బీజేపీ ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీ ని తిడితే కాంగ్రెస్, బీజేపీకి ఏమోస్తుంది అని ప్రశ్నించారు.

సిఎం గా కేటిఆర్ బాధ్యతలు చేపడితే అందరికి సంతోషమే అన్నారు ఆయన. మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ సిఎం   ప్రచారం మా అంతర్గత విషయం అని అన్నారు. ఎవరిని సిఎం  చేయాలన్న దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని స్పష్టత ఇచ్చారు. మా సిఎం  అభ్యర్థి తో బీజేపీకి సంబంధం లేదుఅని అన్నారు. ప్రజలు మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు అని పేర్కొన్నారు. సిఎం  గా కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయి అని, పరిపాలనలో మంచి అనుభవం ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ వల్లే హైదరాబాద్ కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: