దక్షిణాది రాష్ట్రాలకు బిజెపి అన్యాయం చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే దక్షినాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని ఇక్కడి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దక్షినాది రాష్ట్రాల సిఎంలు పలు మార్లు కేంద్రంపై విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణా ప్రబ్భుత్వం కూడా ఇప్పుడు కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస కాస్త సైలెంట్ అయినట్టు కనపడినా సరే ఇప్పుడు మాత్రం స్పీడ్ గానే ఉంది అనేది చెప్పవచ్చు. మంత్రులు కాస్త స్పీడ్ గా బిజెపిని విమర్శిస్తున్నారు.

తాజాగా సికింద్రాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసిన ఐటీ శాఖ మంత్రి  తారకరామారావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు చెప్పడం సంచలనం అయింది. కేటీఆర్ మాట్లాడుతూ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషం అని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వేస్ ఉండడానికి కార్మికుల,ఉద్యోగుల కృషే అని ఆయన కొనియాడారు.

తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో కార్యక్రమాల్లో అన్నింటా స్నేహాభావంతో మెలిగాం అని ఆయన గుర్తు చేసారు. రైల్వే వాగన్ కోచ్ ఫ్యాక్టరీ ని కాజీపేట లో నిర్మిస్తామని చెప్పి ఇప్పటికి కేంద్రం చెయ్యలేదు అని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తుంది అని విమర్శించారు. బులెట్ ట్రైన్స్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలి అని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తే ఉద్యమాలకు సిద్ధం అని హెచ్చరించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణాదికి కేంద్రం న్యాయం చెయ్యాలి,నూతన ప్రాజెక్టులను కేటాయించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: