ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ, జగన్‌ని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతుంది. నిత్యం ఏదొక ఇష్యూపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కూడా చంద్రబాబు పలు అంశాలపై జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అలాగే ఏపీలో వన్‌సైడ్‌గా ఎలాంటి పాలన జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి తమ రామతీర్ధం ప్రోగ్రాంను డిస్టర్బ్ చేయడానికి వస్తే.. అక్కడి భక్తులు అడ్డుకుంటే కళావెంకట్రావుపై కేసు పెడతారా? అని ప్రశ్నించారు. దేవినేని ఉమాను ఒక రౌడీ మంత్రి.. ఆయన ఇంటికి వెళ్లి కొడతా అంటారా? అని బాబు ఫైర్ అయ్యారు. అలాగే జనసేనకు కూడా బాబు సపోర్ట్‌గా నిలిచారు. ప్రకాశంలో ఒక జనసేన కార్యకర్త వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే... ఆ తరువాత ఆయన మరణం ఎలా జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు.

అయితే బాబు అడిగే వాటిల్లో లాజిక్ ఉందని, జగన్ ప్రభుత్వం వన్‌సైడ్‌గా వెళ్లడానికి ఇవి కొన్ని ఉదాహరణలు అని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. రామతీర్ధం ఘటనలో బాబు పర్యటనకు వెళ్ళినప్పుడే, విజయసాయి కావాలని అక్కడకి వచ్చారని, అదే సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు విజయసాయిపై చెప్పులు విసిరారు అని,  ఆ విషయం ప్రజలందరికీ తెలుసని, కానీ ఆ విషయంలో కళా వెంకట్రావుని ఇరికించే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు.

అలాగే ఓ మంత్రి డైరక్ట్‌గా దేవినేని ఉమాని కొడతానని మాట్లాడినా, పోలీసులు నుంచి ఎలాంటి స్పందన లేదని, పైగా దీక్షకు దిగాలని చూసిన ఉమాని అరెస్ట్ చేశారని, ఇది సరైన న్యాయం కాదని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశంలో వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించిన జనసేన కార్యకర్త రెండు రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి ఎవరు కారణమో తేల్చాల్సిన అవసరం పోలీసులకు ఉందని అడుగుతున్నారు. ఏదేమైనా జగన్ ప్రభుత్వం వన్‌సైడ్‌గా వెళుతుందని, ఎప్పుడో ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: