జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాబుకు సపోర్ట్‌గా పలువురు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వస్తున్నారు. అయితే మొదట్లో పలువురు టీడీపీ నేతలు సైలెంట్‌గానే ఉన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నాయకులు బయటకు రాలేదు.

పైగా జగన్ ప్రభుత్వం ప్రతిదానికి కేసు అంటుందని చెప్పి, టీడీపీ నేతలు వెనుకడుగు వేశారు. అయితే గత కొంతకాలంగా టీడీపీ నేతల్లో కొత్త ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టి, మిగతా కార్యక్రమాలని వదిలేయడం, పథకాలు కూడా అప్పులు చేసి ఇస్తుండటంతో ప్రజల్లో కాస్త అసంతృప్తి మొదలైనట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు జగన్‌ని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేసేశారు. ప్రతి విషయానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్‌లో కూడా బాగానే మార్పు వచ్చింది. 2019 ఎన్నికల్లో పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. అయితే జగన్ ప్రభుత్వం, జేసీ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

దీంతో జేసీ ఫ్యామిలీ ఫుల్ యాక్టివ్ అయింది. టీడీపీలో దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు బాగానే పనిచేస్తున్నారు. ఇటు పవన్ కూడా యాక్టివ్ అయ్యి జగన్‌ని డైరక్ట్‌గా టార్గెట్ చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కళా వెంకట్రావు, దేవినేని ఉమాల అరెస్ట్‌లని ఖండించారు. అలాగే 30 సంవత్సరాలు పాటు ఏపీలో జగన్ సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు భజన చేస్తున్నారని, ఒకవేళ ప్రజలకు 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యం కావాలంటే చెప్పండి... తాము తప్పుకుంటామని పవన్ రెడ్డి అన్నారు. మొత్తానికి పవన్ కూడా రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: