ఊహించని విధంగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ కిడ్నాప్ కేసులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు ఏ మాత్రం స్పందించడం లేదు.

ఇది అఖిల వ్యక్తిగత విషయమని టీడీపీ నేతలు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదే విషయం ఏపీలో జరిగి ఉంటే చంద్రబాబు ఓ హడావిడి చేసేవారని, అఖిలని అక్రమంగా అరెస్ట్ చేశారని, జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాట్లాడేవారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది కాబట్టి, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉందని బాబు నోరు మెదపడం లేదని మంత్రి కొడాలి నాని లాంటి వారు మాట్లాడుతున్నారు.

అయితే వైసీపీ నేతలు చెప్పినదానిలో కాస్త వాస్తవం కనిపిస్తోందనే చెప్పాలి. ఈ ఘటన ఏపీలో జరిగి ఉంటే బాబు నిజంగానే రచ్చ చేసేవారు. ఓ మహిళపై కక్ష సాధిస్తున్నారని జగన్, డీజీపీలపై విమర్శలు చేసేవారు. కానీ తెలంగాణలో జరగడం వల్ల బాబు ఏం మాట్లాడటం లేదు. కనీసం అఖిలకు మద్ధతుగా మాట్లాడటం లేదు.

తాజాగా కళా వెంకట్రావు, దేవినేని ఉమాల అరెస్ట్ గురించి మాట్లాడిన బాబు, అఖిల పేరు కూడా ఎత్తలేదు. అలాగే ఇంకా టీడీపీ నేతలపై ఉన్న కేసులని ప్రస్తావిస్తున్న బాబు, అఖిల కేసు గురించి మాట్లాడటం లేదు. పైగా జగన్, డీజీపీలకు మతం మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్, డీజీపీ, హోమ్ మంత్రి క్రిస్టియన్‌లు అని విమర్శలు చేస్తున్నారు.

డీజీపీ తన పదవి కోసం జగన్‌కు సరెండర్ అయ్యారని, టీడీపీ పోరాటం ప్రజల కోసమని తమని తాము హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బాబు ఏ విషయం జరిగిన జగన్, డీజీపీలని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అఖిలకు సపోర్ట్‌గా మాట్లాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: