నాయ‌కులు ఎంద‌రో వ‌స్తుంటారు.. మ‌రెంద‌రో తెర‌మ‌రుగ‌వుతారు. కానీ, ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచే నాయ‌కులు చాలా చాలా త‌క్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పేద‌ల మ‌న‌సు తెలిసిన నాయ‌కులు మ‌రింత త‌క్కువగా ఉంటారు. ఇలా.. పేద‌ల మ‌న‌సు తెలిసిన‌, గెలిచిన నాయ‌కుడు ఎవ‌రైనా ఉంటే.. ప్ర‌కాశం జిల్లాలో ఉన్న ప్ర‌స్తుత నేత‌ల్లో ఆమంచి కృష్ణమోహన్ క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు ఇక్క‌డి పేద‌లు. ``మా కోసం ఎన్నో మంచి ప‌నులు చేశారు. మేం మ‌త్స్య‌కారులం. మాకోసం షెడ్లు క‌ట్టించారు. మా పిల్ల‌ల‌కు ఏటా పుస్త‌కాలు కొనిచ్చేవారు.!`` అని ఇప్ప‌టికీ స్మ‌రించుకునే మ‌త్స్య‌కార కుటుంబాలు అనేకం.

ఒక్క మ‌త్స్య‌కారులే కాదు.. చేతి వృత్తులు చేసుకునేవారు కూడా ఆమంచిని ఇప్ప‌టికీ త‌మ నాయకుడిగానే సొంతం చేసుకుంటారు. త‌మ‌కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేశార‌ని అంటున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఆయ‌న ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని చెబుతున్నారు. చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలిచిన ఆమంచి.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. త‌ర్వాత ప‌రిణామాల్లో ఇక్క‌డ ఆమంచి వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైంది. దీంతో నిత్యం వివాదాలు, విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఓ ఆన్‌లైన్ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

``కృష్ణ‌మోహ‌న్ మంచాయ‌నే. ఆయ‌న వ‌ల్లే అంతో ఇంతో ఇక్క‌డ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగింది. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న వేసిన రోడ్లే ఇప్ప‌టికీ.. ఉన్నాయి. ఆయ‌న చేసిన మంచిని  మ‌రిచిపోతే ఎలా?`` అని కొంద‌రు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కూడా ఈ స‌ర్వేలో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

``గ‌త ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో తెలీదు. మాఇంట్లో వాళ్లంతా ఆమంచికే ఓటేశారు`` అని చెప్పిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే.. ప్ర‌స్తుతం చీరాల‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మాత్రం ఎవ‌రూ మాట్లాడ‌క‌పోయినా.. ఆమంచి త‌ర‌ఫున ఎలాంటి త‌ప్పులు జ‌రిగే అవ‌కాశం లేద‌ని మాత్రం చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం చీరాల ప్ర‌జ‌ల మాట‌ను గ‌మ‌నిస్తే.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఆమంచికి తిరుగులేద‌ని అర్ధ‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: