ఏపీ లో వైసీపీ పార్టీ బలం తగ్గిపోతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది జగన్ కు ముందే తెలిసిన పైకి మాత్రం సుపరిపాలన, సంక్షేమ పాలనా అంటూ కల్లబొల్లి మాటలు చెప్తుంటారు. ఓ వైపు టీడీపీ వైసీపీ ని మట్టుబెట్టాలని చూస్తుంది.. మరోవైపు బీజేపీ కూడా ఉప్పెన దూసుకువస్తుంది.. ఈ నేపథ్యంలో జగన్ వీరిని నిలువరించాలంటే ప్రభుత్వంపైనే కాదు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వం పై దృష్టి పెట్టి పార్టీ ని గాలికొదిలేస్తే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయనకు కేంద్రం నుంచి మద్దతు ఉందో లేదో ఆయనకే అర్ధం కాని పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం.

రాష్ట్రంలో పరిపాలన విషయంలో సిఎం చాలా సీరియస్ గా ఉన్నా సరే బిజెపి మాత్రం ఆయనను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ వస్తుంది. బిజెపి దెబ్బకు జగన్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని టాక్. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ బాధ్యతలను వేరొకరికి అప్పగించి తాను పూర్తిగా పాలనా బాధ్యతలను చూసుకోవాలని భావిస్తున్నారట.. పార్టీ అధ్యక్షా బాధ్యతలను మరో నేతకు అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎవరు అయితే బాగుంటుంది అనే దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నారు. పార్టీలో చాలా మంది జగన్ కోసం మంత్రి పదవులను కూడా వదులుకుని వచ్చారు.

కాబట్టి ఎవరికి ఇవ్వాలో జగన్ కి అర్ధం కావడం లేదు. అయితే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే విషయమై పార్టీలో చర్చ జరుగుతుంది.ప్రభుత్వంలో పార్టీలో రెడ్ల హవా ఉంది అనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో బలపడటానికి గానూ ఇప్పుడు జగన్ ఈ కీలక అడుగు వేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని చెప్పిన జగన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కమ్మ నేతకు ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు అనే భావనలో జగన్ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: