తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేసీఆర్ సీఎంగా తప్పుకుని కేటీఆర్ కు పాలనా పగ్గాలు అప్పచేప్పబోతున్నారని ప్రచారం జోరుగు సాగుతుండటంతో... అన్ని పార్టీల్లోనూ దానిపైనే చర్చ జరుగుతోంది. తమకు సంబంధం లేని అంశమైనా కాంగ్రెస్ , బీజేపీ నేతలు... ఈ విషయంలో మాట్లాడుతున్నారు. అయితే సంచలన ప్రకటనలు చేసే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ముఖ్యమంత్రి విషయంలో మంత్రి కేటీఆర్ కు సపోర్ట్ చేశారు.

                    ఏ రాష్ట్రంలో అయినా తండ్రి సీఎం అయితే, ఆ తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అవుతారని, ఎక్కడైనా అల్లుడిని సీఎం చేస్తారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం మార్పు అనేది ఇంటి పంచాయతీ. కేసీఆర్ కొడుకుని సీఎం చేస్తారో.. కూతురుని చేస్తారో ఆయన ఇష్టం. సీఎం మార్పు వెనుక బీజేపీ ఆట ఉందనుకుంటా అన్నారు జగ్గారెడ్డి.  తెలంగాణ ముఖ్యమంత్రిగా  తారకరామారావును చేయాలనే ప్లాన్ వెనుక బీజేపీ అగ్రనేత ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే  అనుమానం వ్యక్తం
చేశారు. అమిత్ షా డైరెక్షన్ లోనే పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారుయ ప్రజలను మోసం చేసే పనిలో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఉన్నాయన్నారు.

          తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి హరీష్ రావును మరోసారి టార్గెట్ చేశారు జగ్గారెడ్డి.
హరీష్ రాజకీయ నాయకుడా?, పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టే వెతికిన వాడు ఉద్యమకారుడా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టే ముఖ్యమంత్రి విషయంలో జగ్గారెడ్డి కేటీఆర్ కు జై కొట్టారని చెబుతున్నారు. మరోవైపు బీజేపీపైనా తీవ్ర ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి.
బండి సంజయ్ మాట్లాడితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అంటున్నారని, ఆయన ఏ రోజైనా పాడుబడిన గుడికి వెళ్లి దీపం పెట్టారా? అని ప్రశ్నించారు. ‘అమిత్ షా కి అరేండ్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తుకు రాలేదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి .

మరింత సమాచారం తెలుసుకోండి: