రెండు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు బీజేపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే... ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోనూ అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు జనసైనికులు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే... బీజేపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి వివేక్ వెంకటస్వామి ఫేస్‌బుక్ పేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలో చురుగ్గా ఉంటున్న వివేక్.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటారు. కాగా ఆయన ఫేస్‌బుక్ పేజీ తను సొంతంగా ఏర్పాటు చేసుకున్నది కాదని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేజీని తన పేజీగా మార్చుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


vivek venkatswamy ఫేస్‌బుక్ పేజీ ట్రాన్స్‌పరెన్సీ విభాగంలోకి వెళ్లి చూడగా.. 2013 అక్టోబర్ 22న ‘పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తాం’ పేరిట ఈ ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేశారని తెలుస్తోంది. 2014 మార్చి 8న దాని పేరు పవన్ రిపబ్లిక్ పార్టీగా మార్చారు. అదే ఏడాది ఏప్రిల్ 5న డాక్టర్.జి వివేకానంద్‌గా పేజీ పేరును మార్చారు. 2020 జులై 23న వివేక్ వెంకట్‌స్వామిగా పేరు మార్చారు. ఇందుకు సంబంధించిన 13 సెకన్ల నిడివి ఉన్న వీడియోతోపాటు.. స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్న టీఆర్ఎస్ అభిమానులు బీజేపీ నేతను ట్రోల్ చేస్తున్నారు. తన పేరిట సొంత పేజీని ఏర్పాటు చేసుకోవడం చేతకాక.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేజీని డబ్బులిచ్చి కొనుగోలు చేశారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఏపీ మంత్రి పేర్ని నాని ఫేస్ బుక్ పేజీ పేర్లు సైతం ఇలాగే మారాయి. 2016 జూన్ 15న రేష్మీ గౌతమి పేరిట ఈ పేజీని ప్రారంభించారు. మరుసటి రోజే గీతామాధురీ సింగర్ అని మార్చారు. అదే ఏడాది ఆగస్టు 6న పేర్ని నానిగా పేరు మార్చటం విశేషం.






మరింత సమాచారం తెలుసుకోండి: