ప్రాంతీయ పార్టీల విష‌యంలోనే కాకుండా.. జాతీయ పార్టీల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బ్రాహ్మ‌ణులు జాగృతం కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మాట అప్పుడ‌ప్పుడు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా చెబుతూనే ఉండ‌డం విశేషం. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా బ్రాహ్మ‌ణ యువ‌త రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. రెడ్డి, క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన యువ‌త భారీ ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు.

వీరితో పోల్చుకుంటే.. బ్రాహ్మ‌ణ యువ‌త ప్రాతినిధ్యం త‌క్కువ‌గా ఉంది. యూపీ, బీహార్‌.. పంజాబ్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల‌ను తీసుకుంటే.. ఆయా రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణ యువ‌త ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంది. కీల‌క పార్టీల్లో వారే చ‌క్రం తిప్పుతున్నారు. స‌ల‌హాదారులుగా, పార్టీల‌కు కార్య‌ద‌ర్శులుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరి ప్రాధాన్యం చాలా త‌క్కువ‌గా ఉంది. తెలంగాణ‌తో పోల్చుకుంటే.. ఏపీలో ప‌రిస్థితి మెరుగ్గా ఉంద‌నే అనుకోవాలి. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప్ర‌భుత్వాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల వ‌ర‌కే రాజ‌కీయాలను ప‌రిమితం చేస్తున్నాయి.

ఇక‌, అగ్ర‌వ‌ర్ణాలైన క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల చేతుల్లోనే పార్టీలు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలో బ్రాహ్మ‌ణ యువ‌త కూడా రాజ‌కీయంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌తంలో టంగుటూరి ప్ర‌కాశం, అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు వంటి యువ నాయ‌కులుగా వ‌చ్చి.. రాజ‌కీయాల‌ను శాసించి.. త‌మకంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు. వీరి స్ఫూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మ‌ణ యువ‌త ముందుకు వ‌చ్చి.. రాజ‌కీయంగా కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.   

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు indiaherald.com ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు indiaherald.com ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.

మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే.  లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: