ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం గత ఆగస్టు నుంచి జరుగుతూనే ఉంది ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చాలా వరకు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. చాలామంది ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ప్రజల్లోకి రావచ్చు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న సరే ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి నుంచి బయటకు రావడం లేదు. ఎప్పుడైనా అధికారిక కార్యక్రమాలు ఉంటే మినహా జగన్ పెద్దగా ప్రజల్లో కనబడే ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి రాకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లి సీఎం జగన్ గడిపారు.

ఇప్పుడు ప్రజలతో మమేకం అయ్యే విషయంలో ఆయన ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రజలకు దూరంగా ఉండి గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువ నష్టపోయిన పరిస్థితి ఉంది.  ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నారని అంటున్నారు. సీఎంగా ఎంత మంచిగా పరిపాలించినా సరే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవం తెలుసుకుని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గాని ఎన్టీఆర్ గానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గాని ప్రజలలోకి వచ్చేవాళ్ళు. ప్రధాన మంత్రులు కూడా ప్రజల్లోకి తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రజల్లోకి రాకుండా కేవలం ఆదేశాలు ఇవ్వడం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు దీనివలన ఎటువంటి ఉపయోగం ఉండదు అని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: