ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని పరిణామాలు కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతానికి పోతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలకు చెందిన నిధులను సంక్షేమ కార్యక్రమాల కోసం మళ్ళించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటుంది.

సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం ఇప్పటికే భారీగా పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి కేంద్రం ఎంత వరకు నిధులు ఇస్తుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు తో పాటుగా చాలా ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ లో నిధులు ఇవ్వడం లేదు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు సాధిస్తానని 25 ఎంపీలను తనకు ఇవ్వాలని ఆయన అప్పట్లో కోరిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నా సరే ముఖ్యమంత్రి మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే జగన్ స్పందించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో స్పీడ్ గా ముందడుగు వేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: