ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువ మంది చర్చిస్తున్న ఒకే ఒక్క విషయం కేసీఆర్ రాజకీయంగా ఇక కొనసాగలేరని, అంతే కాకుండా వచ్చే నెలలోనే తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని తన కొడుకు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కట్టబెట్టనున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాన్ని కూడా నిర్ణయిచినట్లు తెలుస్తోంది. ఆ శుభ సమయం ఫిబ్రవరి 18న రథసప్తమి రోజున అధికారికంగా ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టనున్నారని వినికిడి.

అయితే ఇప్పుడు చర్చంతా తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ తరువాత అంత కష్టపడిన ఏకైక వ్యక్తి హరీష్ రావు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హరీష్ రావు పరిస్థితి తలక్రిందులుగా ఉంది. దుబ్బాకలో ఓటమి తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. కేటీఆర్ ఎలాగూ సీఎం కానున్నారు కాబట్టి, నా పరిస్థితి ఏమిటని తనలో తానే ఆలోచించుకునే పరిస్థితి. ఇప్పుడు దీనిపై తెలంగాణ భవన్ లో కూడా చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుగుదల, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ముందు నుంచి కేసీఆర్ వెనుక ఉన్న హరీష్ రావుకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ భవన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావుకు పార్టీకి సంబంధించిన పగ్గాలను ఇవ్వనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే హారిష్ రావుకు వర్కింగ్ ప్రెసెడెంట్ పదవిని ఇస్తారంట. కాగా ఇక్క డా మరో చిక్కు కూడా ఉంది.. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తెరాస లో మరో బీసీ ముఖ్యనేత అయిన ఈటెల రాజేందర్ కూడా పోటీ పడుతున్నారని తెరాస వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. హరీష్ రావు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్ధిక మంత్రి శాఖలో పెద్దగా చురుకుగా ఉండడం లేదు. అయితే ఎప్పుడూ ఎవరికీ అందకుండా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన కేసీఆర్, హరీష్ రావు విషయంలో ఏ నిర్ణయం, తీసుకుంటారో తెలియడం లేదు. గత ఎన్నికల సమయంలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించి హరీష్ రావు బాధపడేలాగా చేశారు. అయితేకనీసం ఇప్పుడైనా హరీష్ రావుని సంతృప్తిపరుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: