కొన్ని నెలలకి ముందు ఆంధ్రప్రదేశ్ లో పలు హోటళ్లలో  కుళ్ళిన మాంసం బయటపడిన ఘటనలు మనం చూసాము .. లాక్ డౌన్ తర్వాత తెరుచుకున్న హోటళ్లపై  ఫుడ్ సేఫ్టీ అధికారులను తనిఖీలు చేస్తూ వాళ్ళకి  మతి పోయేలా విషయాలు బయటికి రాగా వాళ్ళు ఇంకా కుళ్ళిన మాంసంతోనే వంటలు వండి వడ్డించడం చూసి అధికారులందరూ షాక్ కి గురైయ్యారు .. ప్రజల ఆరోగ్యాలను రిస్క్ లో పెడుతున్న కారణంగా అటువంటి హోటళ్లపై అధికారులు కేసులను నమోదు చేసారు అంతేకాకూండా భారీ స్థాయిలో జరిమానా విధించారు .. ఇక అసలు విషయం లోకి వెళ్తే  ఈరోజు భాగ్య నగరం లోని  పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు .. ఇంతకీ వాళ్ళు చివరికి ఏమి చేసారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బిర్యానీ. నగరానికి వచ్చిన వారెవరైనా బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు. హైదరాబాద్ బిర్యానీ అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్ గుర్తొస్తుంది. అయితే ఈ హోటల్‌లో అపరిశుభ్ర  మాంసం వాడుతున్నారనే కారణంతో.. జీహెచ్ఎంసీ అధికారులు రూ.25 వేలు జరిమానా విధించారు. అయితే ఇదే ప్రాంతంలో ఉన్నమరో హోటల్  న్యూ ఆస్టారియా లో కూడా  వంట గదులు  శుభ్రంగా లేకపోవడం కారణంగా హోటల్ యాజమాన్యానికి సైతం రూ.25 వేలు ఫైన్ విధించారు.

జీహెచ్ఎంసీకి చెందిన మెడికల్ ఆఫీసర్లు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు గురువారం హోటల్ కేఫ్ బాహర్, హోటల్ బావర్చి, న్యూ ఆస్టారియాలో తనిఖీలు చేపట్టారు. ఈ హోటల్‌‌‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. వంటలు చేయడానికి స్టాంపు వేయని మాసం వాడుతున్నారనే ఫిర్యాదులు పెరగడంతో తనిఖీలు చేపట్టామని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

‘‘హోటల్ యజమానులు  ఎక్కువ మొత్తంలో  అపరిశుభ్ర  మాంసాన్ని వాడుతున్నాయని తనిఖీల్లో తేలింది. ఇక వాళ్ళు సమర్పించిన బిల్లుల విషయంలోను  చాలా తేడా ఉంది’’ అని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు.. హోటళ్లు, రెస్టారెంట్లు,  స్టాంప్ వేసిన మాంసాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.  స్టాంప్ వేయని మాంసాన్ని కొనుగోలు చేయవద్దని. దీని వాళ్ళ మీరు అనారోగ్యం బారిన పడతారని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: