ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతోమంది కస్టమర్లను ఆకర్షిస్తూ బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది కస్టమర్లను కలిగిన బ్యాంకుగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దూసుకుపోతుంది.  అయితే ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారుల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి  అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉంటే.. కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.


 ప్రస్తుతం ఎస్బిఐ డెబిట్ కార్డు ద్వారా విదేశీ లావాదేవీలను ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందాలని భావిస్తే  తప్పనిసరిగా పాన్ కార్డు అకౌంట్ తో లింక్ చేసుకోవడం తప్పని సరిగా నిబంధన పెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం తమ పాన్ కార్డు అకౌంట్ కు లింకు చేసుకోవాలి అంటూ సూచించింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.  అంతే కాదు ఎంతో సులభంగా పాన్ కార్డు ను  అకౌంట్ తో జత పరిచేందుకు అవకాశం కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.





 ఆన్ లైన్ లో  లేదా ఆఫ్ లైన్ లో  కూడా ఎంతో సులభంగా.. పాన్ కార్డు ను స్టేట్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోవచ్చు.  మీరు మీ సమీపంలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి పాన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ ఇచ్చి మీ ఖాతా కు పాన్ కార్డు లింక్ చేసి విదేశీ లావాదేవీలను ఎలాంటి ఆటంకం లేకుండా పొందవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ కి వెళ్లి మీ యూజర్ నేమ్ పాస్ వర్డ్ సాయం తో లాగిన్ అయ్యి మై అకౌంట్ అండ్ ప్రొఫైల్స్ లోకి వెళ్లి..  ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి..  లాగిన్ అయిన తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: