పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై సీయస్ ఆదిత్యనాథ్ దాస్ మీడియాతో మాట్లాడారు. సీయం వింతవ్యాధిపై వెంటనే స్పందించారు.. సమీక్ష జరిపారు అని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు అని ఆయన తెలిపారు. కొమిరేపల్లిలో తీసుకున్న చర్యలపై సమీక్ష చేసాం అని అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ 22 కేసులు వచ్చాయి అని ఆయన వెల్లడించారు. ఎందుకు వస్తుందో కారణాలు అన్వేషిస్తున్నాం అని తెలిపారు. గతంలో ఏలూరుకు సంబంధించి రిపోర్టులు వచ్చాయి అని, కొమిరేపల్లికి సంబంధించి సీయంకు నివేదిక ఇస్తాం  అని అన్నారు.

ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా మాట్లాడారు. ఏలూరుకి సంబంధించి  పరిస్థితి అదుపులోనే ఊంది అని అన్నారు. మళ్ళీ పూళ్ళ, కొమిరేపల్లిలో ఇటువంటి కేసులు వచ్చాయి అని అన్నారు. సియం ఆదేశాలతో ఇక్కడకు రావడం జరిగింది ఆని ఆయన తెలిపారు. ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదు .. అందరూ కోలుకుంటున్నారు అని వెల్లడించారు. వాటర్ లేదా ఇతర కారణాల వలన వచ్చిందా అనేది పరిశీలించాల్సి ఉంది అని అన్నారు. కొమిరేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ మంచినీరు వచ్చే నీటి వనరులు టెస్ట్ లు చేయాలన్నారు.

అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం తీసుకుంటాం  అని తెలిపారు. నివేదికలు వచ్చిన తరువాత శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటాం  అని ఆయన వివరించారు. సాయంత్రం సీయం కు నివేదిక ఇస్తాం అని అన్నారు.  ఏలూరుకు సంబంధించి అన్ని సంస్థలు డిటైల్డ్ రిపోర్టులు ఇచ్చాయి అని వెల్లడించారు. వాటిని సీయం పరిశీలనలో ఉంచారని అన్నారు. జిల్లాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలోని అప్పట్లో డిటైల్డ్ రిపోర్టులో పేర్కొన్నారు అని వివరించారు. వాటి ప్రకారం శాశ్వత చర్యలు తీసుకోవాలని అప్పట్లో హై లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంది అన్నారు.  ప్రతీ జిల్లాలో అన్ని రకాల పరీక్షలు చేయడానికి  ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: