అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 30లక్షల విరాళం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. 141, సెక్షన్  30 ఇష్టారాజ్యంగా వాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ది బురదలోకి లాగిందన్న విధంగా ఉంది  అని అన్నారు. దళితులమీద దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. క్యాడర్ లో ఆత్మన్యూనత వస్తోంది అని అన్నారు. ఇవి ఆపకపోతే మేమూ సహనం కోల్పోవలసి వస్తుంది అని ఆయన పేర్కొన్నారు.

రామతీర్థం వెళ్ళలేక కాదు, అమాయకులు బలవ్వకూడదన్న బాధ్యత నన్ను అక్కడికి వెళ్ళకుండా ఆపింది అని పవన్ వెల్లడించారు. సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడమా? అని ఆయన ప్రశ్నించారు. మతం విషయంలో బాధ్యతగా మాట్లాడకపోతే అనర్దాలకు దారితీస్తుంది అని ఆయన అన్నారు. పాస్టర్ మీద చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వ వైఖరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించేలా ఉంది అని విమర్శించారు. ముక్కోటి ఏకాదశి ఒకరోజు మాత్రమే తెరుస్తారు, అలాంటిది టిటిడి పదిరోజులు తెరిచి ఉంచి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. పీఠాధిపతుల ఆధీనంలో ఆలయాలు ఉంటే ఇలా జరిగేదా? అని నిలదీశారు.

11 ఆలయాల పాలక మండలాలకు, షాడో కమిటీ లు ఏర్పాటు చేస్తాము అని అన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అదే మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే  ఇలా‌ మాట్లాడగలరా? అని నిలదీశారు. సెక్యూలర్ పదానికి భారతదేశం లో అర్థం వేరుగా ఉంది అని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ బలమైన నిబద్దత కలిగిన సంస్థ అలాంటి సంఘం ప్రపంచంలో మరొకటి ఉందా అనుమానం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలపై వైసిపి కుంటిసాకులు ఎందుకు? అని ప్రశ్నించారు. వారి ఎమ్మెల్యేలు బర్త్ డే పార్టీలు పెట్టుకున్నప్పుడు, బార్లు షాపులు తెరిచినప్పుడు లేని కరోనా సమస్య ఇప్పుడేముంది అని నిలదీశారు. మళ్ళీ టిడిపి,బిజెపి, జనసేన కలిసే పరిస్థితి నాకు తెలిసి లేదు. అంతకు మించి నాకు తెలీదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: