ప్రయివేటు,  కార్పేరేట్ కళాశాలలలో ఆంద్రప్రదేశ్ పాఠాశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ మిషన్ ఆధ్వర్యంలో విస్తృత తనీఖీలు నిర్వహించారు. 350 కళాశాలలను కమిషన్ సభ్యులు ప్రొ. నారాయణ రెడ్డి, ఈశ్వరయ్య ,  సిఎవి. ప్రసాద్,  అజయ్ కుమార్ తనిఖీ చేసారు. చైర్మన్ జస్టిస్. ఆర్. కాంతారావు  మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ మూడు రోజులపాటు విజయవాడలోని జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది అని ఆయన అన్నారు.

ముఖ్యంగా జీవో ఎంఎస్ నెంబర్: 57 అనగా గత విద్యా సంవత్సరంలోని ట్యూషన్ ఫీజుకు 30 శాతం తగ్గించాలని అది కూడా విడతల వారీగా వసూలు చేయాలని ‌చెబుతోంది అని పేర్కొన్నారు. అయితే ఫీజుల విషయంలో   కళాశాలలు చాలా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసింది అని వివరించారు. అలాగే కళాశాలల్లో కనీస వసతులు ఉండటంలేదు అని,  కొన్ని చోట్ల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని అన్నారు. కమిషన్ వీటన్నిటినీ ప్రజలకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఉంది అని ఆయన వివరించారు.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము అని ఆయన వివరించారు. అధిక పీజులు వసులు చేస్తున్నాయని భావిస్తే కళాశాల మారవచ్చు అని సూచించారు. అందుకు సంబంధించిన ఎర్పాట్లు కమిషన్ చేపడుతుంది అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కలసి కట్టుగా ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫిజులే కట్టవచ్చు అని పేర్కొన్నారు. కొన్ని కళాశాలలో కనీస వసతులు లేవు అని అన్నారు. కోవిడ్ నిబంధనలు అసలు పాటించడం లేదు అని మండిపడ్డారు. ప్రభుత్వ  జీవో లను ప్రక్కన పెట్టి ఇష్టాను సారంగా పీజులు వసులు చేస్తున్న కళాశాల గుర్తింపు ను రద్దు చేయాలని కమిషన్ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది అని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై ఎవరైన ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.  విద్యార్ధులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: