తెలంగాణాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా ఉన్నాయి. ప్రతీ విషయంలో కూడా సిఎం కేసీఆర్ ని ఆయన తప్పుబడుతునే ఉన్నారు. రాజకీయంగా బలపడే క్రమంలో ఆయన చేస్తున్న విమర్శల దెబ్బకు తెరాస పార్టీ నేతలు పైకి కనపడకపోయినా సరే ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత స్పీడ్ గా బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణాలో బిజెపిని బలోపేతం చేసే క్రమంలో ప్రజా సమస్యల మీద ఆయన ఎక్కువగా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక తాజాగా ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎవరికీ నష్టం లేదు అని అన్నారు. రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి దిగిరావడం సంతోషం  అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కులాల చిచ్చు పెడుతున్నాడు అని మండిపడ్డారు. కోటి దగ్గర ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులపై లాఠీఛార్జ్ అమానుషం అని ఆయన ఆరోపించారు. స్టాఫ్ నర్సుల సమస్యను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేసారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం వచ్చింది శనిపూజ కోసమే అని ఆయన అన్నారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజ చేసి ఆ ద్రవ్యాలను త్రివేణి సంఘంలో కలిపారు అని ఆయన అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ పర్యటన చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి ఐతే ఆటమ్ బాంబ్ కాదు రాష్ట్రంలో అణుబాంబ్ పేలుతుంది అని అన్నారు. రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో పొత్తుపెట్టుకోదు అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ పై అసహనంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే కేటీఆర్ ముఖ్యమంత్రి పేరుతో కొత్త డ్రామా అని విమర్శించారు. కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: